Anakapalli : అప్పుడు వాయిదా పడి.. మొత్తానికి రిలీజ్ అవుతున్న అనకాపల్లి..

మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. (Anakapalli)

  • Updated on- September 16, 2026 / 10:45 AM IST

Anakapalli

Anakapalli : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప మైన లీడ్స్ లో తెరకెక్కిన సినిమా అనకాపల్లి. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టులోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ అప్పుడు కేవలం అనకాపల్లి ఒక్క సిటీలోనే ఈ సినిమా రిలీజ్ చేసి వాయిదా వేశారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Also Read : Ee Paata Korinavaaru Trailer : ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి’ ట్రైలర్ రిలీజ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..

అనకాపల్లి సినిమాని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పి, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థల ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాక నిర్మాతగా, నటుడిగా కూడా మారారు. ఇంద్రజ, బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.