Anand Devarakonda : ‘గం గం గణేశా’.. మరో సినిమాని అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ

వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటికే ఆనంద్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు........

Anand Devarakonda

Anand Devarakonda :  విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి త్వరగానే మంచి పేరు సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చేసిన మూడు సినిమాలతోనే మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు ఆనంద్. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు ఆనంద్.

ఆ తర్వాత వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటికే ఆనంద్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఆనంద్ KV గుహన్ డైరెక్షన్లో ‘హైవే’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ‘బేబీ’ అనే మరో లవ్ జోనర్ సినిమా కూడా చేస్తున్నాడు. తాజాగా ఈ సారి యాక్షన్ సినిమాని అనౌన్స్ చేశాడు.

Pawan Kalyan : హరీష్ శంకర్ నుంచి ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్డేట్

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి డైరెక్షన్ లో హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇవాళ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ‘గం గం గణేశా’ అనే క్యాచీ టైటిల్ ని పెట్టారు ఈ సినిమాకి. టైటిల్ కి అటు ఇటు తుపాకులు ఫైరింగ్ లో ఉన్నట్టు పెట్టారు. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అంటూ ఈ సినిమా యాక్షన్ జోనర్ లో ఉండబోతుందని తెలిపారు. ఇలా ఒక్కో సినిమా ఒక్కో జోనర్ లో చేస్తూ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.