Baby Movie Collections : ఓ రేంజ్ లో బేబీ సినిమా కలెక్షన్స్.. బేబీ బడ్జెట్, వచ్చిన ప్రాఫిట్ ఎంత?.. లాభాలు మాములుగా లేవుగా..

ఈ సినిమాని దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు SKN. స్టార్ కాస్ట్ లేకపోయినా బేబీ థియేట్రికల్ బిజినెస్ 9 కోట్లకు అయింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 10 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి.

Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie Collections and Budget and Profits Full Details

Baby Movie Collections :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో నిర్మాత SKN నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకపోయినా ట్రైలర్ రిలీజ్ తరువాత ప్రేక్షకుల్లో ఒక మోస్తరు అంచనాలు క్రియేట్ చేసి జులై 14న రిలీజ్ అయిన బేబీ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.

బేబీ సినిమాకు మొదటిరోజే ఏకంగా 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి చిన్న సినిమాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అప్పట్నుంచి రోజూ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా రిలీజయి రెండు వారాలు దాటేసి మూడో వారం నడుస్తున్నా కలెక్షన్ల జోరు తగ్గట్లేదు. చిన్న సినిమాకి 50 కోట్లే గ్రేట్ అనుకుంటే ఇంకా దూసుకుపోతూ ఇప్పటికే బేబీ సినిమా ఏకంగా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. బేబీ సినిమా 17 రోజుల్లో 81.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డుని సెట్ చేసింది.

ఇక ఈ సినిమాని దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు SKN. స్టార్ కాస్ట్ లేకపోయినా బేబీ థియేట్రికల్ బిజినెస్ 9 కోట్లకు అయింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 10 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. చిన్న సినిమాకి 20 కోట్లు వస్తాయా అని సినిమా రిలీజ్ కి ముందు అంతా సందేహం వ్యక్తం చేశారు. కానీ సినిమా రిలీజయ్యాక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బేబీ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్ల వరద పారించింది. ఇప్పటికి 81 కోట్ల గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించింది బేబీ సినిమా.

Tamannaah : తెలుగు హీరోలపై తమన్నా కామెంట్స్.. మన స్టార్ హీరోల గురించి ఏమని చెప్పిందో తెలుసా??

సినిమా బడ్జెట్ 10 కోట్లు, ప్రమోషన్స్ కి 4 కోట్లు పెట్టినట్టు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లు కాగా బేబీ సినిమాకు దాదాపు థియేట్రికల్ లోనే 30 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ఇక మ్యూజిక్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి మరిన్ని లాభాలు వచ్చాయి. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ అంటే మాములు విషయం కాదు. ఈ కలక్షన్స్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.