Tamannaah : తెలుగు హీరోలపై తమన్నా కామెంట్స్.. మన స్టార్ హీరోల గురించి ఏమని చెప్పిందో తెలుసా??
తెలుగులో తమన్నా ఆల్మోస్ట్ చిన్నా, పెద్ద, స్టార్ హీరోలతో చేసింది. ఆ స్టార్ హీరోల గురించి హైపర్ ఆది అడగగా వారి గురించి తమన్నా ఏమనుకుంటుందో ఒక్క మాటలో చెప్పేసింది.

Tamannaah Bhatia comments on Telugu Star Heros in Bholaa Shankar Promotions
Tamannaah Bhatia : తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తోంది. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమన్నా(Tamannaah) హీరోయిన్ గా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా హైపర్ ఆది.. తమన్నా, డైరెక్టర్ మెహర్ రమేష్ లని ఇంటర్వ్యూ చేయగా ఇందులో తమన్నా పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.
ఈ నేపథ్యంలో తెలుగులో పలువురు స్టార్ హీరోల గురించి చెప్పింది. తెలుగులో తమన్నా ఆల్మోస్ట్ చిన్నా, పెద్ద, స్టార్ హీరోలతో చేసింది. ఆ స్టార్ హీరోల గురించి హైపర్ ఆది అడగగా వారి గురించి తమన్నా ఏమనుకుంటుందో ఒక్క మాటలో చెప్పేసింది.
OG Movie : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పవన్ కళ్యాణ్.. నెట్టింట పిక్స్ వైరల్..!
చిరంజీవి చాలా యూనిక్, ఒకే ఒక్కడు, ఆయనలా ఎవరూ ఉండలేరు.. పవన్ కళ్యాణ్ వెరీ మాస్ హీరో, అండ్ స్టైలిష్ గా ఉంటారు.. ప్రభాస్ – అందరి డార్లింగ్.. మహేష్ బాబు – చూడటానికి చాలా బాగుంటారు, చాలా అందంగా ఉండే హీరో.. ఎన్టీఆర్ – ఆల్ రౌండర్, అన్ని చేస్తారు, ఆయన డ్యాన్స్, ఫైట్స్ బాగుంటాయి.. రామ్ చరణ్ – నాకు రాయల్ మ్యాన్.. అల్లు అర్జున్ – స్టైలిష్ స్టార్, దేశంలోని స్టార్ హీరోల్లో అతను ఒకడు అని తెలిపింది. దీంతో తెలుగు హీరోల గురించి తమన్నా చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఆ హీరోల అభిమానులు తమ హీరో గురించి ఏం చెప్పిందా అని ఆ ఇంటర్వ్యూని చూస్తున్నారు.