Baby Movie : ఓటీటీలో కూడా బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్..
జూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ఆహాలో నిన్న ఆగస్టు 25 నుంచి బేబీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
- Saketh U
- Published On : August 26, 2023 / 12:48 PM IST
Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie creates new record in Aha OTT
Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వంలో శ్రీనివాస కుమార్ (SKN) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. చిన్న సినిమాగా రిలీజయిన బేబీ యూత్ ని బాగా ఆకట్టుకొని భారీ విజయం సాధించింది. ఎవరూ ఊహించనంత భారీ విజయం సాధించి థియేటర్స్ లో ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
జూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ఆహాలో నిన్న ఆగస్టు 25 నుంచి బేబీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఆహా గోల్డ్ మెంబర్స్ కి ఒక రోజు ముందు నుంచే స్ట్రీమ్ అయింది. ఆహాలో బేబీ సినిమా రావడంతో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు ఓటీటీలో చూసేస్తున్నారు. ఇన్నాళ్లు థియేటర్స్ లో రికార్డులు కొట్టిన బేబీ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్స్ సెట్ చేస్తుంది.
Salaar Movie : సలార్ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన శృతిహాసన్.. రోజుకో భాషలో..
బేబీ సినిమా ఆహాలోకి వచ్చిన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని ఆహా టీం అధికారికంగా తెలిపింది. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే బేబీ సినిమా ఈ రికార్డ్ సెట్ చేసిందంటే ఇంకా మున్ముందు సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందని భావిస్తున్నారు.
