Salaar Movie : సలార్ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన శృతిహాసన్.. రోజుకో భాషలో..

సలార్ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇప్పటిదాకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సలార్ సినిమా అప్డేట్ వచ్చింది.

Salaar Movie : సలార్ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన శృతిహాసన్.. రోజుకో భాషలో..

Salaar Movie Update Shruti Haasan Dubbing started in all languages

Updated On : August 26, 2023 / 12:29 PM IST

Salaar Movie Update : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్.

సలార్ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించి సలార్ పార్ట్ 1 ceasefire అని తెలిపారు. ఇక సలార్ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇప్పటిదాకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సలార్ సినిమా అప్డేట్ వచ్చింది.

Boys Hostel Review : బాయ్స్ హాస్టల్ మూవీ రివ్యూ.. నవ్వులతో దద్దరిల్లిపోయిన థియేటర్..

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారు. తాజాగా శృతిహాసన్ సలార్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. డబ్బింగ్ చెప్తున్న ఫోటో షేర్ చేసి.. మూడో రోజు, మూడో భాష అని పోస్ట్ చేసింది. సలార్ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని భాషల్లోనూ శృతి హాసన్ సొంతంగా డబ్బింగ్ చెప్తున్నట్టు అర్ధమవుతుంది. నెల రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అంటే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని చాలా ఫాస్ట్ గా చేయాలని తెలుస్తుంది. ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

Salaar Movie Update Shruti Haasan Dubbing started in all languages