Boys Hostel Review : బాయ్స్ హాస్టల్ మూవీ రివ్యూ.. నవ్వులతో దద్దరిల్లిపోయిన థియేటర్..

 క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌యం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare) సినిమాని తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ (Boys Hostel) పేరుతో విడుద‌ల చేశారు.

Boys Hostel Review : బాయ్స్ హాస్టల్ మూవీ రివ్యూ.. నవ్వులతో దద్దరిల్లిపోయిన థియేటర్..

Boys Hostel Movie Review and Audience Rating

Boys Hostel Movie Review : క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌యం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare) సినిమాని తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ (Boys Hostel) పేరుతో విడుద‌ల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాని నేడు ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా కన్నడలో తెరకెక్కించినా అక్కడ గెస్ట్ అప్పీరెన్స్ గా చేసిన వాళ్ళ ప్లేస్ లో రష్మీ, తరుణ్ భాస్కర్ లను గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించారు. నితిన్ కృష్ణమూర్తి అనే యువదర్శకుడు తెరకెక్కించిన ఈ బాయ్స్ హాస్టల్ సినిమాలో ప్రజ్వల్, మంజునాథ నాయక ముఖ్య పాత్రలు పోషించగా రిషబ్ శెట్టి కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన సీన్ ఉంటుంది.

ఇక కథ విషయానికి వస్తే ఒక బాయ్స్ హాస్టల్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఫుల్ లెంగ్త్ కామెడీతో చూపించారు. రేపు పొద్దున్నే ఎగ్జామ్ ఉండగా రాత్రి ఆ హాస్టల్ వార్డెన్ కొంతమంది స్టూడెంట్స్ పేర్లు రాసి చనిపోతే వాళ్లంతా ఏం చేశారు అనేది కథాంశం. ఇదంతా డైరెక్ట్ గా చూపించకుండా అక్కడే హాస్టల్ లో ఉండే ఓ స్టూడెంట్ సినిమా తీయాలి, డైరెక్టర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు. అతని పాయింట్ లో ఈ సినిమాని చూపిస్తారు.

ఇక ఇందులో చాలా వరకు స్క్రీన్ ప్లే ఉన్నా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే లేకుండా కూడా సీన్స్ ఉంటాయి. అయినా ఇవి సినిమాకు కనెక్ట్ అవుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పటిదాకా సరదాగా నవ్వుతున్న ఆడియన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. సెకండ్ హాఫ్ కొన్నిచోట్ల సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ఓవరాల్ గా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా హ్యాపీగా నవ్వుతూ చూసేయొచ్చు.

Rahul Sipligunj : నేను రాజకీయాల్లోకి రాను.. నేను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యట్లేదు

యాక్టర్స్ అంతా అదరగొట్టారు. ముఖ్యంగా ప్రజ్వల్, మంజునాథ నాయక సినిమాని నిలబెట్టారు. బాయ్స్ హాస్టల్ లో దాదాపు 100 మందిని హ్యాండిల్ చేస్తూ సినిమా తీయడం చాలా కష్టం. కానీ ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ కావడంతో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాకి తెలుగులో కూడా డైలాగ్స్ బాగా కుదిరాయి. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేపించారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే దీనిపై పాజిటివ్ రెస్పాన్స్ రాగా కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాతో చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ హ్యాట్రిక్ హిట్ కొడతారని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి పార్ట్ 1 అని ఇచ్చారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండొచ్చు అని తెలుస్తుంది.

గమనిక: ఈ రివ్యూ, రేటింగ్స్ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే