Anand Deverakonda : సినిమా కోసం వేసిన సెట్ వర్షాలకు పడిపోయింది.. రష్మికతో కావాలనే అలా ప్లాన్ చేసాం..

ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక జంటగా తెరకెక్కిన ‘గం గం గణేశా'(Gam Gam Ganesha) సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఆనంద్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. మిడిల్ క్లాస్ మెలొడీస్ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆ టైంలోనే బేబీతో పాటు ‘గం గం గణేశా’ స్క్రిప్ట్ కూడా విన్నాను. అత్యాశ, భయం, కుట్ర అనే దానిపై కథ కామెడీగా సాగుతుంది. నాకు స్వామి రారా లాంటి క్రైమ్ కామెడీ సినిమాలు ఇష్టం. ఇది ఆ తరహాలో అనిపించడంతో ఓకే చేశాను. ఇందులో ఇప్పటివరకు చేసిన సినిమాలకు డిఫరెంట్ గా ఉండే యాక్టివ్, ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో కథ అంతా ఓ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఉదయ్ చాలా అద్భుతంగా రాసుకున్నాడు. కామెడీ కూడా సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయిందని తెలిపారు.

ఈ సినిమా కష్టాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒప్పుకున్నాక షూటింగ్ ఆలస్యం అయ్యింది. నేను బేబి మేకోవర్ లో ఉన్నాను. దాని నుంచి బయటకు వచ్చాక ఈ షూట్ చేసాం. మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ వల్ల ఆలస్యం అయింది. ఈ సినిమాలో ఓ వినాయకుడి మండపం సెట్ భారీగా వేసాము. వర్షాల వల్ల అది పడిపోయింది. మళ్లీ ఆ సెట్ నిర్మించి షూట్ చేసాం. దానికి ఇంకొంచెం టైం పట్టింది. ఇలా పలు కారణాలతో ఈ సినిమా లేట్ అయింది అని తెలిపాడు.

అలాగే.. ఇటీవల కొంతమంది ఫ్యామిలీలు, యూత్ ఆడియెన్స్ కి గం గం గణేశా స్పెషల్ షో వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు. దాంతో సినిమా రిజల్ట్ పై నాకు మరింత నమ్మకం పెరిగింది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి అని అన్నారు.

ఈ సినిమాలో మొదటిసారి డ్యాన్స్ చేశాను, బాగా చేసాను అనే కామెంట్స్ పై స్పందిస్తూ.. నేను చిన్నప్పటి నుంచి పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఖాలీగా ఉంటే మా అన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమంటాడు. మా నాన్న కూడా నాలో గ్రేస్ ఉంది, డ్యాన్స్ నేర్చుకో అని చెప్పేవాళ్ళు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాటకు డాన్స్ చేశా. కానీ సినిమా లెంగ్త్ ఎక్కువ అయిందని తీసేసాం. ఈ సినిమాలో డ్యాన్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేశాను. అది బాగా క్లిక్ అయింది అని చెప్పాడు.

అలాగే.. బేబితో వంద కోట్ల గ్రాస్ వచ్చిందని నెక్స్ట్ ఇంకా పెరగాలని అనుకోను. గం గం గణేశా సినిమాకు ఏడు కోట్లు షూటింగ్ ఖర్చు అయింది. పైన ప్రమోషన్స్, మిగిలిన ఖర్చులకు పోగా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు వస్తే చాలు, ఇంకా ఎక్కువ వస్తే ఇంకా మంచిదే. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కలిసి చూడొచ్చు అని తెలిపాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికతో మాట్లాడిన మాటలు వైరల్ అయిన దానిపై స్పందిస్తూ.. అది కావాలనే అలా ప్లాన్ చేసాము, వైరల్ అవ్వాలనే చేసాము. రష్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్. తను నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది అని తెలిపాడు.

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. నాకు రా యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ లాంటి సినిమాలు చేయాలని ఉంది. వినోద్ అనంతోజు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో అలాంటి సినిమానే చేస్తున్నాను. బేబీ కాంబోలో ఇంకో సినిమా, స్టూడియో గ్రీన్ నిర్మాణంలో బైలింగ్వల్ డ్యూయెట్ సినిమా చేస్తున్నాను అని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు