Anand Mahindra
Anand Mahindra : ప్రభాస్ లైన్లో పెట్టిన పాన్ ఇండియా సినిమాల్లో ‘ప్రాజెక్టు K’ ఒకటి. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అత్యంత భారీ బడ్జెట్ తో సై-ఫై సినిమాగా నాగ్ అశ్విన్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమితాబ్, దీపికా లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారు. అత్యంత ప్రతిషాత్మకంగా వైజయంతి మూవీస్ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.
అయితే ఇటీవల ఈ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాహనాలు కావాలని మహీంద్రా సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రను రిక్వెస్ట్ చేశారు నాగ్ అశ్విన్. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ చీఫ్ వేలు మహీంద్రా మీతో మాట్లాడతారని, మీకు కావాల్సిన విధంగా వాహనాల్ని రూపొందిస్తాడని తెలిపారు. దీంతో సినిమాలో డిఫరెంట్ భారీ వెహికల్స్ వాడతారని తెలుస్తుంది.
Michael : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో వరుణ్‌సందేశ్..
తాజాగా నాగ్ అశ్విన్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సెంటర్‌ని సందర్శించారు. దీనిపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్.. ”అద్భుతమైన క్యాంపస్. ప్రకృతి, టెక్నాలజీ రెండు ఒకే చోట ఉన్నాయి. వేలు మహీంద్రా టీంకు ధన్యవాదాలు. ఇలా సపోర్ట్ చేస్తున్న ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చూస్తుంటే ‘ప్రాజెక్టు K’ మరింత గ్రాండియర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.
Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..
అయితే నాగ్ అశ్విన్ చేసిన ఈ ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆనంద్ మహీంద్రా..” నాగ్ అశ్విన్, మీరు రూపొందిస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి మీరు నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు. మీరు ఈ సినిమాతో హాలీవుడ్‌ను ఢీ కొట్టబోతున్నారని నాకు నమ్మకం ఉంది” అంటూ రిప్లై ట్వీట్ ఇచ్చారు. ఇక ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్స్ చూసి ‘ప్రాజెక్టు K’ పై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.
Well @nagashwin7 I have to admit you have got me as excited now about this blockbuster sci fi film you’re creating. I have a hunch you’re going to beat Hollywood hollow… https://t.co/XiqyaEBIDr
— anand mahindra (@anandmahindra) March 13, 2022