Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..

నయన్, విగ్నేష్ కలిసి గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగేస్తున్నారు. ఇక వీరు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మీడియా, అభిమానులు వీరి పెళ్లి....

Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..

Nayan

 

Vignesh Shivan :  స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు, బిజినెస్‌లు చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు కూడా. ఈ లవ్‌బర్డ్స్ సరదాగా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి దుబాయ్ కూడా వెళ్లారు. అంతేకాక నయన్, విగ్నేష్ కలిసి గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగేస్తున్నారు.

 

ఇక వీరు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మీడియా, అభిమానులు వీరి పెళ్లి ఎప్పుడు అని అడగగా త్వరలోనే చేసుకుంటామని ప్రతిసారి చెప్తున్నారు. ఇన్నాళ్లు ఎంగేజ్మెంట్ ఒక్కటే సీక్రెట్‌గా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా వీరిద్దరికి పెళ్లి కూడా ఐపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. నయన్, విగ్నేష్ కలిసి దేవాలయాలు అన్ని చుట్టేస్తున్న తరుణంలో ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. ఎప్పటిలాగే అక్కడ ఉన్న అభిమానులు వారిని తమ కెమెరాల్లో బంధించారు.

Balakrishna : ‘అఖండ’ శతదినోత్సవ వేడుకల్లో బాలయ్య బాబు సందడి

ఆ ఆలయంలో తీసిన వీరి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని ఉంది. సాధారణంగా మన దేశంలో పెళ్ళైన ఆడవాళ్ళూ మాత్రమే నుదుటి మీద కుంకుమ పెట్టుకునే ఆచారం ఉంది. నయనతార ఒక్కసారిగా ఇలా కనపడేసరికి నయన్‌‍కి, విగ్నేష్‌కి సీక్రెట్ గా పెళ్లి అయిపోయిందని అంటున్నారు నెటిజన్లు. కొన్ని తమిళ మీడియాలలో కూడా వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అంటూ కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో నయన్, విగ్నేష్‌లకే తెలియాలి. దీనిపై వీరిద్దరూ మాత్రం నోరు విప్పటంలేదు. నయన్ అభిమానులు మాత్రం వీరు త్వరగా, గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు.