Anandhi Varalaxmi Sarath Kumar Sivangi Teaser Released
Sivangi Teaser : తెలుగమ్మాయి ఆనంది తెలుగు, తమిళ్ లో సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పుడు ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో ‘శివంగి’ అనే సినిమా రాబోతుంది. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు నిర్మాణంలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా తాజాగా శివంగి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే.. ఓ భార్య పాత్రలో ఆనందికి ఒకేసారి కష్టాలు ఎదురైతే ఏం చేసింది అనే కథాంశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మీరు కూడా శివంగి టీజర్ చూసేయండి..
వంగేవాళ్ళు ఉన్నంత వరకు..మింగేవాళ్ళు ఉంటారు.. నేను వంగే రకం కాదు..మింగే రకం అంటూ ఆనందితో మాస్ డైలాగ్స్ చెప్పించారు. దీంతో ఇన్నాళ్లు ఆనంది ఆల్మోస్ట్ అన్ని క్లాస్, క్యూట్ పాత్రలతోనే కనిపించగా శివంగి సినిమాతో ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మాస్ గా కనిపించబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్జ్ పనుల్లో ఉంది.