Raviteja Son : త్రివిక్రమ్ కొడుకుతో పాటు రవితేజ కొడుకు కూడా.. సందీప్ రెడ్డి వంగ కోసం.. రవితేజ లాగే..

రవితేజ కొడుకు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా ది గ్రేట్ సినిమాలో నటించాడు.

Raviteja Son : త్రివిక్రమ్ కొడుకుతో పాటు రవితేజ కొడుకు కూడా.. సందీప్ రెడ్డి వంగ కోసం.. రవితేజ లాగే..

Raviteja Son Mahadhan also Working for Sandeep Reddy Vanga Along with Trivikram Son Rishi

Updated On : February 23, 2025 / 8:53 AM IST

Raviteja Son : సినిమా సెలబ్రిటీల చాలా మంది పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తారు. అదే కోవలో త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి, రవితేజ కొడుకు మహాధన్ కూడా సినీ పరిశ్రమలోకి రాబోతున్నారు అని తెలుస్తుంది. త్రివిక్రమ్ తనయుడు మీడియాకు ఎక్కువగా కనపడలేదు. రవితేజ కొడుకు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా ది గ్రేట్ సినిమాలో నటించాడు. అప్పుడప్పుడు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

Also Read : Kubera Movie : వివాదంలో నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా టైటిల్.. అది మా టైటిల్.. మాకు నష్టపరిహారం ఇవ్వాలి..

త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి ఆల్రెడీ విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. త్వరలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు అని సమాచారం. త్రివిక్రమ్ కొడుకుతో పాటు రవితేజ కొడుకు మహాధన్ కూడా అదే పని చేయబోతున్నాడట.

మహాధన్ హీరో అవుతాడో లేదో రవితేజ క్లారిటీ ఇవ్వలేదు కానీ సినీ పరిశ్రమలోకి రావొచ్చు అని తెలుస్తుంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇప్పుడు ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయనున్నాడు అని తెలుస్తుంది. దీంతో త్రివిక్రమ్ కొడుకు, రవితేజ కొడుకు ఇద్దరూ సందీప్ రెడ్డి వద్ద శిష్యరికం చేసి బయటకు రాబోతున్నారు.

Also Read : Dil Raju – NTR : ‘రామయ్య వస్తావయ్యా’ ప్లాప్ పై దిల్ రాజు కామెంట్స్.. ఎన్టీఆర్ తో ఆరు గంటలు చర్చించాం..

రవితేజ కూడా తన కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసాడు. ఇప్పుడు తన తండ్రి లాగే మహాధన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేస్తే సినిమా గురించి అన్ని విషయాలు తెలుస్తాయని, సినిమా కష్టాలు కూడా తెలుస్తాయని, అనుభవం బాగా వస్తుందని చాలా మంది సెలబ్రిటీల పిల్లలు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గానే చేస్తారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు మొదట ఒక్క సినిమాకు అయినా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్ళే.