Kubera Movie : వివాదంలో నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా టైటిల్.. అది మా టైటిల్.. మాకు నష్టపరిహారం ఇవ్వాలి..
తాజాగా కుబేర టైటిల్ మాది అంటూ ఓ నిర్మాత, దర్శకుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Sekhar Kammula Nagarjuna Dhanush Kubera Movie Title in Dispute
Kubera Movie : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ మెయిన్ లీడ్స్ లో రష్మిక మందన్న కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవల ఈ కుబేర టైటిల్ సినిమాపై వివాదం నెలకొంది.
Also Read : Dil Raju – NTR : ‘రామయ్య వస్తావయ్యా’ ప్లాప్ పై దిల్ రాజు కామెంట్స్.. ఎన్టీఆర్ తో ఆరు గంటలు చర్చించాం..
తాజాగా కుబేర టైటిల్ మాది అంటూ ఓ నిర్మాత, దర్శకుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మెట్ లో నిర్మాత కరిమకొండ నరేందర్ మాట్లాడుతూ.. కుబేర టైటిల్ మాది. దాన్ని శేఖర్ కమ్ముల తన సినిమాకు ఎలా పెట్టుకుంటారు. 2023 నవంబర్ లో నేను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ‘కుబేర’ టైటిల్ ని రిజిస్టర్ చేయించాను. విరాట్ దర్శక త్వంలో కుబేర సినిమాను ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసాం. టైటిల్ కు ముందు తన పేరును పెట్టుకుని శేఖర్ కమ్ముల సినిమా తీస్తున్నారు. దీనివల్ల మాకు ఎంతో నష్టం వస్తుంది. ఈ టైటిల్ ని 5 భాషల్లో రిజిస్టర్ చేయించాం. టైటిల్ అయినా మార్చుకోవాలి లేదా మాకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Disha Patani : బాబోయ్.. యాడ్ కోసం దిశా పటాని హాట్ ఫోటో షూట్.. వీడియో చూశారా? ఎంత క్రియేటివ్ గా తీశారో..
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత, డైరెక్టర్, వారి తరపు న్యాయవాది రాజేశ్ తో కలిసి పాల్గొన్నారు. మరి దీనిపై శేఖర్ కమ్ముల కానీ, మూవీ యూనిట్ కానీ స్పందిస్తారా చూడాలి. నాగార్జున – ధనుష్ సినిమాకు కుబేర టైటిల్ అని చెప్పినా పోస్టర్స్ లో మాత్రం శేఖర్ కమ్ముల కుబేర అనే రాస్తున్నారు. దీంతో ఆల్రెడీ కుబేర టైటిల్ రిజిస్టర్ అయిందని తెలిసే శేఖర్ కమ్ముల సినిమాకు ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించి తన పేరు జత చేసి టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది.