Dil Raju – NTR : ‘రామయ్య వస్తావయ్యా’ ప్లాప్ పై దిల్ రాజు కామెంట్స్.. ఎన్టీఆర్ తో ఆరు గంటలు చర్చించాం..
దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా రామయ్య వస్తావయ్యా.

Dil Raju Interesting Comments on Harish Shankar NTR Ramayya Vasthavayya Movie Result
Dil Raju – NTR : ఏ సినిమా హిట్ అవుద్దో, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో ఒక్కోసారి చెప్పటం ఎవరికైనా కష్టమే. హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. హరీష్ శంకర్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ ఇవ్వడంతో ఎన్టీఆర్ తో సినిమా అనగానే దానిపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read : Disha Patani : బాబోయ్.. యాడ్ కోసం దిశా పటాని హాట్ ఫోటో షూట్.. వీడియో చూశారా? ఎంత క్రియేటివ్ గా తీశారో..
దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా రామయ్య వస్తావయ్యా. శృతి హాసన్, సమంత ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన పగను తీర్చుకోడానికి ప్రస్తుతంలో విలన్ ఇంట్లో ఉండే హీరోయిన్ కి దగ్గరవ్వడం, విలన్ ని చంపడం లాంటి ఓ రెగ్యులర్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. రామయ్య వస్తావయ్యా సినిమా పోయింది. నేను, హరీష్ రెండు గంటలకు కలిసాం. హీరో గారి దగ్గరకు వెళ్ళాం. మూడింటికి కూర్చున్నాం. ఎందుకు ఫ్లాప్ సినిమా తీసాం, అది ఎందుకు ఫ్లాప్ అయింది అని మేము ఆరు గంటలు డిస్కస్ చేసుకున్నాం ఒక క్లారిటీ రావడానికి. ఫ్లాప్ సినిమా అని తెలిసిన తర్వాత నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నది మేము బయటకు వచ్చి మా సినిమా పోయింది అని రెండో రోజే చెప్పలేం కదా అని అన్నారు.
దీంతో ఒక సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని డిస్కస్ చేసుకొని అలంటి తప్పులు మరోసారి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అని తెలుస్తుంది. అలాగే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అనే ప్రమోట్ చేస్తారు. కలెక్షన్స్ రావడం కోసం, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవ్వడానికి. అది ఇప్పటికీ జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దిల్ రాజు ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టారు.