Pawan Kalyan : హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్.. కంగారు పడాల్సిన పనేం లేదు.. ఇంకొన్ని వైద్య పరీక్షలు..
తాజాగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

Pawan Kalyan went to Apollo Hospital for Health Checkup Photos goes Viral
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలనలో బిజీగా ఉన్నారు. తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖలలో అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. ఇటీవలే కేరళ, తమిళనాడు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లొచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read : APPSC Group2 Exams : గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీసీఎస్సీ కీలక సూచన..
దీంతో జనసేన పార్టీ అధికారికంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు షేర్ చేసి.. ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరున గానీ, మార్చి మొదటి వారంలో గానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు అంటూ రాసుకొచ్చారు.
దీంతో అభిమానులు కంగారు పడాల్సిన పనేం లేదు, సాధారణ ఆరోగ్య పరీక్షలే అని తెలుస్తుంది. అయితే పవన్ హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫ్యాన్స్, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ హాస్పిటల్ బెడ్ పై, స్కానింగ్ మిషన్ లో ఉండి పరీక్షలు చేయించుకుంటున్న ఫోటోలు వైరల్ గా మారాయి.