Anant Nag : కేజీఎఫ్ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు (Anant Nag) అరుదైన గౌరవం దక్కింది.
Anant Nag to receive Dadasaheb Phalke Award on Sept 22
Anant Nag : భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. దశాబ్దాలుగా భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత సినీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం జరగనుంది.
Debjani Emotional Bigg Boss Promo 3 : కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ..
🎬THE DADASAHEB PHALKE AWARD 2024 GOES TO…
Shri ANANT NAG
On the recommendation of the Dadasaheb Phalke Award Selection Committee, the Government of India is pleased to announce that the Actor will be conferred the prestigious Dadasaheb Phalke Award 2024 for his contribution… pic.twitter.com/3WKnWZDGs0
— PIB India (@PIB_India) September 16, 2026
అనంత్ నాగ్ 1973లో సంకల్ప మూవీతో కన్నడ చిత్ర సీమలో అడుగుపెట్టారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ, ఇంగ్లీష్ బాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. మంథన్, కొండుర, కల్యుగ్, కన్నేశ్వర రామ, గోది బణ్ణ, రాజకుమార, గాలిపట-2, కేజీఎఫ్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఆయన పని చేశారు. మల్లేశ్వర్యం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు. 2025లో ఆయన్ను కేంద్రం పద్మభూషణ్‌తో సత్కరించింది.
