Ananya Birla announce 10 thousand free tickets for Adipurush movie
Adipurush : ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). ఇందులో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర చేశాడు. జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులే కాక దేశమంతటా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చిత్రయూనిట్ ప్రతి థియేటర్లో ఆంజనేయ స్వామికి ఒక సీట్ ఉంచుతామని ప్రకటించారు. ఇక రామాయణం కథని ఈ జనరేషన్ లో ప్రజలకు, పిల్లలకు మరింత చేరువ చేయాలని పలువురు ప్రముఖులు ఆదిపురుష్ టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు.
ఇటీవల ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ఫ్రీగా ఆదిపురుష్ చూపిస్తాను, అందుకోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తున్నాను అని ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తాను అని తెలిపాడు. రామ్ చరణ్ కూడా కొంతమందికి ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపించాలని అనుకుంటున్నట్టు సమాచారం. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తన ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి 101 టికెట్స్ ఆదిపురుష్ సినిమా కోసం ఫ్రీగా ఇస్తానని ప్రకటించారు. తాజాగా ఈ కోవలోకి మరో సెలబ్రిటీ చేరింది.
Allu Arjun : మరోసారి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో.. ఈ సారి ఆహా కోసం.. ఏం ప్లాన్ చేశారో?
ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు, బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా కూడా ఆదిపురుష్ సినిమాకు 10 వేల టికెట్స్ బుక్ చేస్తానని, ఆ టికెట్స్ ని పలు పిల్లల సేవా సంస్థలకు, అనాథాశ్రమాలకు అందచేయనున్నట్టు ప్రకటించింది. అనన్య బిర్లా బాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమ ఫ్యామిలీకి చెందిన పలు బిజినెస్ లు కూడా చూసుకుంటూనే అనన్య బిర్లా ఫైఉండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఇప్పుడు ఆదిపురుష్ కోసం ఇలా టికెట్స్ ఫ్రీగా ఇస్తుండటంతో పలువురు అనన్య బిర్లాను అభినందిస్తున్నారు.