POTTEL Official Trailer
అనన్య నాగళ్ళ, యువచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పొట్టేల్. సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Bigg Boss 8 : హెయిర్ కట్ ఛాలెంజ్.. గడ్డం లేకుండా పృథ్వీని చూశారా?
తన బిడ్డకు చదువు చెప్పించడం కోసం ఒక గొర్రెల కాపారి ఊరు మొత్తాన్ని ఎలా ఎదిరించాడు అనేది ఈ సినిమా స్టోరీగా ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
kiran Abbavaram : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..