Bigg Boss 8 : హెయిర్ కట్ ఛాలెంజ్.. గడ్డం లేకుండా పృథ్వీని చూశారా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో వారం కొనసాగుతోంది.

Bigg Boss Telugu 8 Day 47 Promo 2 Hair Cut Challenge
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో వారం కొనసాగుతోంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. బెడ్ పై అవినాష్, మెహబూబ్ నిద్రపోతుండగా బిగ్‌బాస్ వారిద్దరిని పిలిచి ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో మిగిలిన వారంతా నవ్వుకున్నారు. అనంతరం గార్డెన్ ఏరియాలో చిన్న కప్పుల్లో కాఫీ, వయొలిన్ ఏర్పాటు చేశారు. అవినాష్ కాఫీ ఎలాఉందని అడుగగా.. కాస్త వేడిగా ఉందని చెబుతాడు. కాస్త మెల్లిగా తాగండి అని బిగ్‌బాస్ అనడంతో నవ్వులు విరిశాయి.
డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటూ ఎప్పుడైనా గడ్డం తీసెస్తే సరదాగా నీ ఫొటోని పంపించు అంటూ పృథ్వీని గౌతమ్ అడుగుతాడు. ఇందుకు పృథ్వీ నవ్వుతాడు. విష్ణు వద్దని అనగా.. ఏదైతే అది అవుతుంది ట్రిమ్మర్‌తో తీసేద్దాం అని నిఖిల్ అంటారు. వద్దు భయ్యా.. నేను చచ్చిపోతా.. అసలు నా ఫేస్ గడ్డం లేకుండా చూడలేను అని పృథ్వీ అన్నాడు.
kiran Abbavaram : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..
ఆ తరువాత టీవీలో పృథ్వీ గడ్డం తీసినట్లుగా ఉన్న కొన్ని ఫోటోలను బిగ్‌బాస్ చూపించగా అందరూ షాక్ అవుతారు. మూడు ఫోటోలు ఉండగా.. ఒక్కొ ఫోటో కింద ఒక్కొ అకౌంట్ పెట్టాడు. ఆ ఫోటోల్లో హెయిర్ స్టైల్ చేయించుకుంటే ఆ అమౌంట్ ప్రైజ్‌మనీకి యాడ్ అవుతందని బిగ్‌బాస్ చెబుతాడు.
అవినాష్ ఫోటోలు సైతం వస్తాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఫోటోల్లో ఉన్న హెయిర్ కట్ చేయించుకున్నారా? ఎంత అమౌంట్‌ను ప్రైజ్ మనీకి యాడ్ చేశారో చూడాల్సిందే.
Anee Master : జానీ మాస్టర్ ఇష్యూపై స్పందించిన అనీ మాస్టర్.. జానీ మాస్టర్‌తో 2 ఇయర్స్ కలిసి..