Ananya Nagalla : పిల్లబచ్చాలు మా సినిమాకి రావొద్దు.. అనన్య నాగళ్ళ అంత మాట అనేసిందేంటి..
ఇప్పటికే తంత్ర సినిమా నుంచి టీజర్ వచ్చి భయపెట్టగా, ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కూడా వచ్చి మెప్పించింది.
- Saketh U
- Published On : February 23, 2024 / 02:40 PM IST
Ananya Nagalla Tantra Movie Unit tells kids not come to their movie
Ananya Nagalla : వకీల్ సాబ్, మల్లేశం సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ళ ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కీ రోల్స్, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకెళ్తుంది. అనన్య నాగళ్ళ మెయిన్ పాత్రలో హారర్ సినిమా ‘తంత్ర’(Tantra) రానుంది. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే తంత్ర సినిమా నుంచి టీజర్ వచ్చి భయపెట్టగా, ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కూడా వచ్చి మెప్పించింది. తంత్ర హారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా తంత్ర సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని క్రియేటివ్ గా డిజైన్ చేశారు. తంత్ర సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. ఈ సినిమాకు A సర్టిఫికెట్ రావడంతో.. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ.. టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ ఆ టెడ్డీబేర్ మీకు జోల పాడితే..ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ ‘తంత్ర’ సినిమా. మార్చి 15న మీముందుకు వస్తోంది.మీరు సిద్ధమా? అని పోస్ట్ చేశారు.
హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే పిల్లలు భయపడతారని ముందుగానే పిల్ల బచ్చాలు మా సినిమాకి రాకండి అంటూ ఇలా కొత్తగా ప్రమోట్ చేయడం విశేషం. ఎవరైనా మా సినిమాకి రండి అంటారు, A సర్టిఫికెట్ వచ్చినా కొంతమంది చెప్పరు, కానీ తంత్ర మూవీ యూనిట్ సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీని వాడి ఇలా ప్రమోషన్ చేయడం గమనార్హం.
Also Read : Siddharth Roy Review : ‘సిద్దార్థ రాయ్’ రివ్యూ.. లాజిక్స్ వర్సెస్ ఎమోషన్స్..
ఇక తంత్ర సినిమాని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరి హారర్ సినిమాతో అనన్య నాగళ్ళ ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి.
