Anasuya
anasuya bharadwaj : బుల్లితెర, వెండి తెరపై తన నటన, అందంతో అలరిస్తున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తెలుగు టీవీ షోలకు గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్లలో ఈమె ఒకరు. బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ…యాంకర్ గా కొనసాగిస్తూనే…వీలున్నప్పుడల్లా సినిమాలో నటిస్తున్నారు ఈమె. ఒక విధంగా హాట్ బ్యూటీ యాంకర్ గా పేరు సంపాదించారు. క్షణం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ…రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి..మంచి మార్కులు కొట్టేసింది.
ఈ అందాల యాంకరమ్మ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించనివి, ఇతరత్రా విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా..ఇన్ స్ట్రా గ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. వయ్యారంగా..స్లోగా నడుస్తున్న ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. సాతియా అనే హిందీ సినిమాలో నీలి ఆస్మా అనే పాపులర్ పాటకు స్లోమోషన్‌లో వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లింది. కేక పుట్టిస్తున్న ఈ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇటలీలో ఈ వీడియోను తీశారు. మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమాలో అనసూయ ఓ పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా అక్కడకు వెళ్లిన అనసూయ తన అందచందాలతో అదరగొడుతోంది ఈ భామ.