Anasuya Bharadwaj rejects actress chance in Allu Arjun movie
Anasuya : టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూనే, మెయిన్ లీడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అయితే ఈ భామ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయడానికంటే ముందు అల్లు అర్జున్ సినిమాల్లో నటించే అవకాశం అందుకుందట. అది కూడా హీరోయిన్ ఛాన్స్ అని తెలుస్తుంది. అనసూయ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేయకముందు ఒక గ్రాఫిక్స్ కంపెనీలో వర్క్ చేసిందట.
ఇక అక్కడ అనసూయని చూసిన డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ తో తెరకెక్కించే ఆర్య 2 సినిమాలో నటించే ఆఫర్ ఇచ్చాడట. కానీ అనసూయ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఆ టైములో అనసూయ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళికి సిద్ధంగా ఉందట. అందుకే ఆమె నో చెప్పిందట. అయితే సుకుమార్ ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది ఆమె చెప్పలేదు. అయితే ఆ మూవీలో మెయిన్ లేడీ క్యారెక్టర్స్ అంటే కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే.. సుకుమార్ అనసూయని శ్రద్ధాదాస్ పాత్ర కోసమే అడిగి ఉంటాడని తెలుస్తుంది.
Also read : Hansika : అల్లు అర్జున్‌ను అడగండి ఈ ప్రశ్న.. విలేఖరికి హన్సిక సమాధానం..
శ్రద్ధాదాస్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అప్పుడు అనసూయ ఓకే చెప్పి ఉంటే అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా కనిపించేది. ఈ సినిమా ఆఫర్ ని మాత్రమే కాదు. ఇలా చాలా సినిమా ఆఫర్లు కూడా కాదందట. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ పక్కన పార్టీ సాంగ్ డాన్స్ చేసే ఆఫర్ కి కూడా నో చెప్పింది. ఆ సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆ తరువాత నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ఒక పాటలో కనిపించిన అనసూయ.. అడివి శేష్ ‘క్షణం’ సినిమా నుంచి నటిగా కెరీర్ ని స్టార్ట్ చేసింది.