Anasuya Bharadwaj shares a video with her husband enjoying in Thailand Beaches
Anasuya Bharadwaj : అనసూయ యాంకర్ గా బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ట్విట్టర్ లో అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను అలరిస్తుంది అనసూయ. ఇటీవల మరిన్ని బోల్డ్ ఫొటోలు పెడుతుంది. తన ఫ్యామిలీతో ట్రిప్స్ వేస్తూ ఆ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.
నేడు అనసూయ – భరద్వాజ్ లది వివాహ వార్షికోత్సవం కావడంతో ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్లారు ఈ జంట. థాయ్‌లాండ్ బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ. తాజాగా తన భర్తతో థాయ్‌లాండ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది.
NTR : వెకేషన్ నుంచి వచ్చేసిన ఎన్టీఆర్.. దేవర మొదలవుతుందా?
ఈ వీడియోలో అనసూయ బికినిలో ఉంది. తన భర్తతో కలిసి సముద్రం వద్ద బికినిలో రచ్చ చేస్తుంది. అక్కడే సముద్రం వద్ద ఉన్న రెస్టారెంట్ లో తినడం కూడా ఈ వీడియోలో పోస్ట్ చేసింది. అనసూయ ఇలా బికినిలో కనపడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాటు తన భర్తను ఉద్దేశించి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తనమీద ఉన్న ప్రేమను తెలియచేస్తూ స్పెషల్ గా మ్యాటర్ రాసి పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ బికినీ వీడియో వల్ల మరోసారి అనసూయ వైరల్ గా మారింది. అనసూయ ని ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా, కామెంట్స్ చేద్దామా అనుకునే వాళ్లంతా అనసూయని బికినిలో చూసి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఆడుకుంటారో చూడాలి.