Anasuya Bharadwaj : మీరు ఏడ్చేలా చేస్తా.. అనసూయ వరుస ట్వీట్స్ వైరల్..

ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ తో అనసూయ వైరల్ పోస్టులు. మీరు ఏడ్చేలా చేస్తా..

Anasuya Bharadwaj tweets gone viral in social media

Anasuya Bharadwaj : టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. పలు విషయాల్లో నెటిజెన్స్ నుంచి భారీ ట్రోలింగ్ ని ఎగురుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఏడుస్తున్న వీడియో ఒకటి షేర్ చేసి సోషల్ మీడియాతో పాటు మీడియా వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో చూసి.. తన పై వస్తున్న ట్రోలింగ్ కి అనసూయ బాధ కలిగి ఏడ్చి ఉంటుందని అని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత మరో వీడియో షేర్ చేసి.. తనపై వచ్చే నెగెటివిటీ వల్ల కాదు ఏడ్చింది అంటూ పేర్కొంది.

Actress Sridevi : చ‌నిపోయిన ఐదేళ్ల‌కు.. శ్రీదేవి చిర‌కాల కోరిక‌ తీర్చిన భర్త బోనీ కపూర్

ఈ విషయంలో కూడా అనసూయ ట్రోలింగ్ ని ఎదురుకుంది. దీంతో వీటిపై రియాక్ట్ అవుతూ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ వేస్తూ వస్తుంది. “ఒక వ్యక్తిని తక్కువ చేసి, వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ మీరే సానుభూతి చూపించి, మీకు మీరే మంచి వాళ్లమని ఫీల్ అయ్యిపోవడం. ఒకవేళ ఆ వ్యక్తి మీరే చేసే పనులకు ఎదురుండి నిలబడితే తట్టుకోలేకపోవడం వంటి వైఖరిని కపటధోరణి అంటారు. మనిషి బ్రతుకున్నంత కాలం చచ్చేలా వేధించి, మరణించాకా సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకునే మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది” అంటూ విచారం వ్యక్తం చేసింది.

Mahesh Babu : పోకిరి, బిజినెస్ మేన్ మాత్రమే కాదు.. ప్రతి సినిమా రీ రిలీజ్..

అలాగే ఈ విమర్శలకు బయపడి ఆగిపోకుండా సమస్య ఎదురైనప్పుడు ఎలా ముందుకు సాగాలో చూపిస్తూ ఎంతోమందికి ఉదాహరణగా నిలిచేలా జీవితంలో ముందుకెళ్తా అంటూ పేర్కొంది. తనని ద్వేషించేవాళ్ళు తనని చూసి ఏడ్చేలా చేస్తానంటూ ట్వీట్ చేసింది. ఇక మరో ట్వీట్ లో.. ‘అసలు మనం ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియాలో ఉండటానికి కారణం అటెన్షన్‌ పొందడం కోసం కాదా?’ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.