×
Ad

Anasuya : 42 మందిపై కేసు పెట్టిన అనసూయ..

అనసూయ తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు 42 మందిపై ఫిర్యాదు చేసింది. (Anasuya)

Anasuya

Anasuya : నటి, యాంకర్ అనసూయ తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు 42 మందిపై ఫిర్యాదు చేసింది. తనపై కొందరు సోషల్ మీడియాలో వేదికగా చేస్తున్న ట్రోలింగ్ పై ఫిర్యాదు చేసింది. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని, కరాటే కల్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్, ఓ ఛానెల్ యాంకర్‌.. ఇలా కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసింది అనసూయ.(Anasuya)

Also Read : Spirit : ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సమ్మర్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..

తనపై ఆన్‌లైన్ వేధింపులు పెరిగాయని, డిసెంబర్ 23 నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి అని, అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్న నటి అనసూయ ఫిర్యాదు చేయడంతో ఈ 42 మందిపై కేసు నమోదు చేసారు పోలీసులు..