Spirit : ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సమ్మర్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..
ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. (Spirit)
Spirit
Spirit : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో వచ్చి పర్లేదు అనిపించాడు. ఇటీవల రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పిరిట్ సినిమా షూటింగ్ చేస్తున్నట్టు ప్రభాస్ చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.(Spirit)
ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. తృప్తి డిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఒంటికి దెబ్బలు తగిలితే కట్లు కట్టుకొని షర్ట్ లేకుండా చేతిలో ఆల్కహాల్ బాటిల్ పట్టుకొని సిగరెట్ పెట్టుకుంటే తృప్తి డిమ్రి ఆ సిగరెట్ వెలిగిస్తున్నట్టు ఉంది. దీంతో ఈ ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయింది.
Also Read : Meena Sagar : ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. భారీ యాక్షన్ సినిమాగా స్పిరిట్ తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మూవీ యూనిట్.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా 2027 మార్చ్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే వచ్చే సంవత్సరం సమ్మర్లో ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ తో హంగామా చేయనున్నారు. మరి చెప్పిన టైంకి వస్తుందా లేక వాయిదా పడుతుందా చూడాలి. పండగ పూట రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Tollywood Sankranthi : ఈ సంక్రాంతి టాలీవుడ్ విన్నర్ ఎవరు? ఏ సినిమా ఎలా ఉంది..? ఫుల్ రిపోర్ట్..
