Anasuya : సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం..

సావిత్రిలా నటించడం ఎంత కష్టమో ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం అంటూ అనసూయ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Anasuya comparison comments about savitri acting and exposing beauty

Anasuya : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ తన సోషల్ మీడియా పోస్టులతో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మహానటి సావిత్రికి సంబంధించిన ఒక ట్వీట్ చేసిన నెట్టింట ట్రెండ్ అవుతుంది. ‘సావిత్రిలా నటించడం ఎంత కష్టమో ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం’ అంటూ అనసూయ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ అసలు ఆమె ఆ కామెంట్స్ ఎందుకు చేసింది..?

ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించే ఒక అవార్డు వేడుకల్లో అనసూయ పాల్గొని.. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ తో అలనాటి తారలు సావిత్రి, జామున, శ్రీదేవి, సౌందర్య.. గెటప్స్ లో కనిపించి వారికీ ట్రిబ్యూట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అనసూయ తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇక ఈ పోస్టుకి ఒక నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. ‘ఎక్స్‌పోజింగ్ చేసినంత ఈజీ కాదు. సావిత్రిలా నటించడం అంటే’ అంటూ కామెంట్ చేశాడు.

Also read : Mrunal Thakur : టాలీవుడ్‌కి కోడలుగా మృణాల్ ఠాకూర్.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్..

ఇక దీనికి అనసూయ రిప్లై ఇస్తూ.. “కరెక్ట్ గా చెప్పారండి. సావిత్రమ్మలా యాక్ట్ చేయటం ఎవరి తరము కాదు. నేను ట్రిబ్యూట్ ఇచ్చాను అంతే. అలాగే ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా ఈజీ కాదు. ఫీజికల్ గా, ఎమోషనల్ గా చాలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకొని ఏమి ప్రదర్శించాలి అనుకుంటున్నామో అనేదాని పై కాన్ఫిడెంట్ గా ఉండాలి” అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.