×
Ad

నేనూ హీరోయిన్‌నే.. మీది చేతగానితనం.. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే..: శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్

"బట్టలు ఎలాంటివి వేసుకోవాలో మీకు నేను చెబుతున్నానా? బట్టలు ఎలా వేసుకోవాలో మీరు మా అందరికీ చెబుతున్నారు" అని అన్నారు.

Anasuya: హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన కామెంట్లపై దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై యాంకర్, సినీనటి అనసూయ మండిపడ్డ నేపథ్యంలో శివాజీ మరోసారి స్పందిస్తూ.. ఈ వివాదంలోకి ఆమె ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అంతేగాక, అనసూయ రుణం తీర్చుకుంటానంటూ హెచ్చరించారు.

దీంతో అనసూయ దీనిపై మళ్లీ స్పందించారు. ఇన్‌స్టా లైవ్‌లో ఆమె మాట్లాడారు. “నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా శ్రేయోభిలాషులు కొందరు వీడియోలు షేర్ చేశారు. నేను నేర్చుకుంది ఏంటంటే.. అతి వినయం దూర్త లక్షణం. నాకు ఇంట్లో ఒకటి నేర్పించేవారు. అమ్మ, తల్లి, బుజ్జి అంటూ మాట్లాడేవారు చాలా డేంజర్‌. పెద్దవాళ్లు ఈ విషయం తెలిపారు. నేడు కొన్ని వీడియోలు చూస్తుంటే ఇదే అనిపించింది.

నిన్న స్టోర్ లాంచ్‌కు వెళ్లాను. అక్కడ జర్నలిస్ట్ అడిగితే మాట్లాడాను. ఆయన (శివాజీ)కు అనిపించింది ఆయన చెప్పినప్పుడు.. నాకు అనిపించింది నేను చెప్పాను. ప్రెస్‌ మీట్‌లో విక్టిమ్‌ కార్డ్ ప్లే చేస్తున్నారు. ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఫేక్ ఫెమినిస్టులు అని కొందరు అంటున్నారు. ఫేక్ ఫెమినిస్టులు అనేవారు లేరు. అందరూ సమానంగా ఉండాలి అనేదే ఫెమినిజం.

Also Read: ఆ 2 పదాలు వాడినందుకే క్షమాపణలు.. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కాదు.. ఎవరికీ భయపడా: శివాజీ సంచలనం

అబ్బాయిలు కూడా ఫెమినిస్టులుగా ఉంటారు. బట్టల గురించి మాట్లాడడం చేతగానితనమే అవుతుంది. వాళ్లమీద వాళ్లకి కంట్రోల్ లేనప్పుడు ఇతరుల మీద రుద్దుతారు. నేను కూడా హీరోయిన్‌నే. ఫీమేల్‌ లీడ్ క్యారెక్టర్స్ నేను కూడా చేశాను.

బట్టలు ఎలాంటివి వేసుకోవాలో మీకు నేను చెబుతున్నానా? మీరు మా అందరికీ బట్టలు ఎలా వేసుకోవాలో చెబుతున్నారు. మేము చిన్న పిల్లలం కాదు. చాలా వినమ్రతతో చెబుతున్నాను. నేను కూడా ఒక ఆడదాన్ని, గ్లామరస్‌గా ఉండాలనుకునేదాన్ని. కాబట్టి నా ఒపీనియన్‌ అడిగితే నేను చెప్పాను.

కామెంట్లు చేసి సారీ చెప్పేస్తున్నారు. మీరు చాలా తెలివిగలవారు అనుకుంటే సృష్టికర్తలమైన మేము అందరం కలిస్తే ఎలా ఉంటుంది?ఆ టోన్‌ ఏదైతే ఉందో అదే మీ నిజస్వరూపం.

నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మగవాళ్లకి చెప్పండి. అడవి జంతువుల్లా హీరోయిన్ల మీద ఎందుకు పడతారని అడగండి. ఆడవాళ్లు అలా బట్టలు వేసుకోవద్దని ఎక్కడ రాసి ఉంది? బట్టలు అనే మ్యాటరే లేదు. క్యారెక్టరే మ్యాటర్” అని అన్నారు.