ఆ 2 పదాలు వాడినందుకే క్షమాపణలు.. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కాదు.. ఎవరికీ భయపడా: శివాజీ సంచలనం
"ఆ రెండు పదాలు మాత్రమే అన్‌పార్లమెంటరీగా ఉన్నాయి. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాత్రం కరెక్టుగానే ఉంది" అని అన్నారు.
Karate Kalyani: హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన కామెంట్లపై దుమారం రేగిన వేళ దీనిపై ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇవాళ దండోరా సినిమా ప్రెస్‌మీట్‌లో శివాజీ మరోసారి సారీ చెప్పారు.
“నేను ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నాను. జగన్‌పై, ఏ మహిళపైనా హద్దుదాటి మాట్లాడలేదు. మొన్న అనుకోకుండా ఆ మాటలు వచ్చాయి. అనుకోకుండా రెండు పదాలు దొర్లాయి. క్షమాపణలు చెబుతున్నాను.
అయితే, ఆ రెండు పదాలు మాత్రమే అన్‌పార్లమెంటరీగా ఉన్నాయి. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాత్రం కరెక్టుగానే ఉంది. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు. రెండు రోజుల నుంచి నేను నిద్రపోలేదు.
దండోరా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయాను. నాలోనేను అంతర్మథనం పడ్డాను. అన్నేళ్లు పాలిటిక్స్‌లో ఉన్నానని, ఎందుకిలా జరిగిందని నాకు అనిపించింది. చివరకు దండోరా సినిమా ప్రమోషన్‌కు వచ్చాను” అని శివాజీ చెప్పారు.
Also Read: శివాజీ రైట్ టైమ్‌లో రైట్‌గా చెప్పారు.. ఎందుకంటే?: అనసూయ, చిన్మయికి కరాటే కల్యాణి కౌంటర్
కాగా, హీరోయిన్ల గురించి శివాజీ అవమానకరంగా మాట్లాడారంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడికి ఇప్పటికే ఫిర్యాదు అందింది. శివాజీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు ఫీమేల్ యాక్టర్లు డిమాండ్ చేశారు. లేదంటే శివాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.
