శివాజీ రైట్ టైమ్‌లో రైట్‌గా చెప్పారు.. ఎందుకంటే?: అనసూయ, చిన్మయికి కరాటే కల్యాణి కౌంటర్

"మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ అలాంటి డ్రెస్‌ వేసుకుని వెళ్లింది. నేను ఓ పోస్ట్ పెట్టాను" అని అన్నారు.

శివాజీ రైట్ టైమ్‌లో రైట్‌గా చెప్పారు.. ఎందుకంటే?: అనసూయ, చిన్మయికి కరాటే కల్యాణి కౌంటర్

Updated On : December 23, 2025 / 10:04 PM IST

Karate Kalyani: హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన కామెంట్లపై దుమారం రేగిన వేళ దీనిపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఇవాళ 10టీవీలో జరిగిన డిబేట్‌లో ఆమె మాట్లాడారు.

“నేను శివాజీని సమర్థిస్తాను. ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీలకి ఔన్నత్యం ఉంది. ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతి చోట భారతదేశ స్త్రీని చేతులెత్తి గౌరవించి, నమస్కారం పెడతాం. కట్టు బొట్టు మన సంప్రదాయం. భారతదేశం అంటే అందరికీ ఓ గౌరవం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంది.

ఆయన మాట్లాడిన ఓ మాటపై అభ్యంతరాలు చెబుతున్నారు. చికిరి చికిరి అని ఓ పాట వచ్చింది. ఆ పాటలోనూ ఈ పదాలను వాడారు. మరి అందులో తీసేయాలని చిన్మయి ఎందుకు అడగలేదు? దానిపై ఆవిడ ఎందుకు ట్వీట్ చేయలేదు?

శివాజీ రైట్ టైమ్‌లో రైట్‌గా చెప్పారు. డ్రెస్సింగ్.. ఎవర్ సెన్స్ వాళ్లదే అవ్వచ్చు. మరి అనసూయ వాళ్ల అబ్బాయి ఒడుగు చేసినప్పుడు పిచ్చి డ్రెస్ వేసుకుని ఎందుకు కూర్చోలేదు ఆవిడ? పట్టు చీర ఎందుకు కట్టుకున్నారు? అంటే వాళ్లకు సంప్రదాయం తెలుసు, ఆచారం తెలుసు, వ్యవహారం తెలుసు.

కానీ, సంప్రదాయాలు, కట్టు బొట్టు వాళ్లకు అవసరమైనప్పుడు వాడుకుంటారు. మీరు ఇండస్ట్రీలో ఎదిగారు. ఎదిగినప్పుడు మనమంటూ ఒక రోల్ మోడల్ గా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే అర్ధనగ్న ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. చీరలు కట్టుకుని వెళ్లవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లదే కావచ్చు. ఆ చీరలు అందంగా చూపించొచ్చు.

మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ ఉల్లిపొరలాంటి డ్రెస్‌ వేసుకుని వెళ్లింది. నేను ఓ పోస్ట్ పెట్టాను. ఆమె డ్రెస్ కూడా బాలేదని చాలామంది కామెంట్ చేశారు. ఈ కాలంలో అమ్మాయిలు విపరీతంగా సిగరెట్లు కాల్చుతున్నారు” అని చెప్పారు.