Susank Bharadwaj : అనసూయ భర్త గురించి మీకు తెలియని విషయాలు.. బైక్ రైడర్‌గా.. ట్రావెలర్‌గా..

అనసూయ భర్త భరద్వాజ్ కూడా పాపులర్ అయ్యాడు అనసూయ వల్ల. అనసూయ చాలా సార్లు తన భర్తతో కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Anasuya Husband Susank Bharadwaj Interesting Facts Bike Travelling

Susank Bharadwaj :  యాంకర్ అనసూయ(Anasuya) ప్రస్తుతం ఫుల్ పాపులర్. అటు టీవీ షోలతో సంపాదించిన స్టార్ డమ్ సినిమాల్లో వాడేస్తుంది. తన నటనతో కూడా ఇంప్రెస్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తుంది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అంది. ఇక సోషల్ మీడియాలో ట్వీట్స్, హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది అనసూయ.

అనసూయ భర్త భరద్వాజ్ కూడా పాపులర్ అయ్యాడు అనసూయ వల్ల. అనసూయ చాలా సార్లు తన భర్తతో కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ భర్త ఫైనాన్స్, అకౌంట్స్ కి సంబంధించిన జాబ్ చేస్తాడని సమాచారం. అయితే ఆ జాబ్ కాకుండా చాలా మందికి తెలియనిది ఏంటంటే అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ ఒక బైక్ ట్రావెలర్, రైడర్ కూడా.

Also Read : Maama Mascheendra : ఓటీటీలోకి సుధీర్ బాబు సినిమా..! థియేట‌ర్‌లో ఉండ‌గానే..?

అనసూయ భర్త దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్, BMW, హార్లీ డేవిడ్ సన్ లతో పాటు పలు రకాల బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ మీద తన ఫ్రెండ్స్ తో కలిసి బైక్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు సుశాంక్ భరద్వాజ్. తన సోషల్ మీడియాలో తన బైక్ ట్రావెలింగ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలకు బైక్స్ మీదే ట్రావెల్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అనసూయ భర్త ఇలా బైక్ ట్రావెలింగ్ కూడా చేస్తారా, మంచి ఫ్యాషన్ తో చేస్తున్నారు అంటూ అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.