Anasuya On Not Attending Godfather Promotions
Anasuya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.
Anasuya Bharadwaj: బాలయ్య సినిమాలో హాట్ యాంకరమ్మ.. ఏం చేస్తుందంటే..?
గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ మనకు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నటించిన అనసూయ, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనసూయ ఎందుకు పాల్గొనలేదా అనే సందేహం అందరిలో నెలకొంది. కాగా, తాజాగా గాడ్‌ఫాదర్ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడానికి గల కారణాన్ని అనసూయ చెప్పుకొచ్చింది.
Anasuya : మీలా పనీపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది.. మళ్ళీ ట్విట్టర్లో అనసూయ రచ్చ..
తాను ప్రస్తుతం వరుసగా షూటింగ్స్ చేయడంతో బిజీగా ఉండటం వలన, గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయినట్లుగా అనసూయ తెలిపింది. అటు సినిమా షూటింగ్స్‌తో పాటు షోలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అభిమానులను ఎంటర్‌టైన్ చేయడం కోసమే తాను వర్క్ చేస్తున్నానంటూ అనసూయ తాజాగా తెలిపింది.