Anasuya Bharadwaj
Anasuya Bharadwaj: వయస్సుతో పాటు వన్నెను కూడా పెంచేస్తుంది అనసూయ. ఏదో ఒకలా ఫొటోషూట్ చేసి నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంది.
తన గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. నిత్యం ఫొటోషూట్స్‌తో నెటిజన్స్‌ని అలరిస్తూ ఉండే అనసూయ వీకెండ్ స్పెషల్ ఏమో.. బ్లాక్ డ్రెస్ లో ఫొటో షూట్ చేసింది. శనివారం రోజు రెడ్ స్కర్ట్‌లో హోయలు పోతూ రోడ్డెక్కి సందడి చేసింది.
ఇక ఆదివారం కూడా అభిమానులకు పసందైన వినోదాన్ని అందించింది. వీధుల్లో బ్లాక్ కలర్ స్కర్ట్‌తో ఫొటోలకు స్టిల్స్ తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అందాన్ని అట్టా పెంచేస్తున్నావేం.. అనసూయ అనేలా ఉన్న ఫొటోలు చూసి అభిమానులకు మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రీసెంట్‌గా థ్యాంక్యూ బ్రదర్ సినిమాలో, చావు కబురు చల్లగా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో అలరించిన అనసూయ ప్రస్తుతం ఖిలాడి, రంగమార్తాండ అనే చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప చిత్రంలోను అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని టాక్ వినిపిస్తున్నాయి.