Anasuya - Rashmi
Anasuya – Rashmi : గతంలో జబర్దస్త్ కి అనసూయ, రష్మీ యాంకర్స్ గా చేసిన సంగతి తెలిసిందే. అనసూయ జబర్దస్త్ మానేసి సినిమాలతో బిజీ అవ్వగా రష్మీ ఇంకా జబర్దస్త్ చేస్తుంది. తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేయగా పాత వాళ్ళందర్నీ పిలిపించారు. ఈ క్రమంలో అనసూయ కూడా వచ్చింది.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి. స్టేజిపై రష్మీ ఏడ్చేయగా అనసూయ ఎమోషనల్ అయింది.
Also Read : Adi Reddy : రెండోసారి తండ్రి అయిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.. వీడియో వైరల్..
అనసూయ మాట్లాడుతూ..జీవితం బోల్డన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండా ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి అంటూ రష్మిక దగ్గరికి వెళ్లి హత్తుకుంది. దీంతో రష్మిక ఏడ్చేసింది. అనసూయ.. ఎవరికీ తెలియనివి కొన్ని ఇప్పుడు తెలిసిపోయేలా ఉన్నాయి ఈ ప్యాచప్ వల్ల, ఓ వీళ్ళిద్దరూ మాటాడుకోవట్లేదా అని చెప్పింది. దీనికి రష్మీ.. అదేదో వాట్సాప్ లో గాని ఫోన్ చేసి గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా అంటే అలా అయితే చాలా ఇగోలు అడ్డు వస్తాయి అని అనసూయ తెలిపింది.
దీంతో గత కొన్నాళ్లుగా రష్మీ – అనసూయ మాట్లాడుకోవట్లేదని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఏమైనా విబేధాలు వచ్చాయా లేక ఇద్దరూ వాళ్ళ వర్క్స్ తో బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకోవట్లేదా తెలియాలి. మరి ఫుల్ ఎపిసోడ్ లో అనసూయ వీరి ఇష్యూ గురించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 8,9 తేదీల్లో రాత్రి ఈటీవీలో 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవ్వనుంది. మీరు కూడా ఈ జబర్దస్త్ ప్రోమో చూసేయండి..
Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ రిలీజ్.. శ్రీలీల, రవితేజ కుమ్మేసారుగా..