Adi Reddy : రెండోసారి తండ్రి అయిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.. వీడియో వైరల్..

ఆదిరెడ్డి తాను రెండోసారి తండ్రి అయినట్టు తెలిపాడు.

Adi Reddy : రెండోసారి తండ్రి అయిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.. వీడియో వైరల్..

Adi Reddy

Updated On : August 5, 2025 / 4:55 PM IST

Adi Reddy : కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఫైనల్ వరకు వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ తో తెచ్చుకున్న ఫేమ్ ని ఆదిరెడ్డి సరిగ్గానే ఉపయోగించుకున్నాడు. పలు టీవీ షో లు, యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలతో పాటు పలు బిజినెస్ లు చేస్తూ సెటిల్ అయ్యాడు.

ఆదిరెడ్డి తాను రెండోసారి తండ్రి అయినట్టు తెలిపాడు. ఇటీవల ఆదిరెడ్డి తన భార్య కవితకు సీమంతం నిర్వహించాడు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తాజాగా ఆదిరెడ్డి భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. డాక్టర్ చేతుల మీదుగా పాపాయిని ఆదిరెడ్డి తీసుకుంటున్న వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

 

Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ రిలీజ్.. శ్రీలీల, రవితేజ కుమ్మేసారుగా..

ఆదిరెడ్డికి గతంలో ఓ పాప ఉంది. ఇప్పుడు మరోసారి పాప పుట్టడంతో మరోసారి మహాలక్ష్మి పుట్టిందంటూ పోస్ట్ చేసాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆదిరెడ్డికి కంగ్రాట్స్ చెప్తున్నారు.