Maa Elections : ‘మా’ ఎన్నికల్లో అనసూయ ఓడిపోయారా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై యాంకర్ అనసూయ స్పందించారు. నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటిస్తారు?

Maa Elections

Maa Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై యాంకర్ అనసూయ స్పందించారు. నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటిస్తారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది.

Read More : Manchu Vishnu: రాజీనామా చేస్తే నీ ఇంటికొచ్చి కొరికేస్తా..!!

Anasuya

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ భారీ మెజారితో గెలిచినట్లుగా వార్తలు వచ్చాయి. మొదటి విజయం అనసూయాదే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తీరా ఇవ్వాళా విడుదల చేసిన మా విజేతల జాబితాలో ఆమె పేరు కనిపించలేదు. దీంతో అనసూయ ఆవేదనతో ఈ ట్వీట్ చేశారు.