7/G Brundavan Colony 2: అనశ్వర రాజన్ కు అదిరిపోయే ఛాన్స్.. ‘7/G బృందావన్ కాలనీ’లో కొత్త అనిత ఈమెనే

7/G బృందావన్ కాలనీ 2(7/G Brundavan Colony 2) సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Anaswara Rajan playing female lead in 7G Brindavan Colony 2 movie

  • కల్ట్ క్లాసిక్ మూవీలో అనశ్వర రాజన్ కి ఛాన్స్
  • ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్
  • జులై లో విడుదల కానున్న సినిమా

7/G Brundavan Colony 2; ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మలయాళ కుట్టి అనస్వర రాజన్. రోషన్ మేక హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనస్వర రాజన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ అమ్మడుకు కెరీర్‌లో ఊహించని బంపర్ ఆఫర్ దక్కించుకుందట. సౌత్ ఇండియాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘7/G బృందావన్ కాలనీ’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘7/G బృందావన్ కాలనీ 2(7/G Brundavan Colony 2)’ వస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రెస్టీజియస్ సినిమాలో కథానాయికగా అనస్వర రాజన్ ఎంపికైందట. 7/G బృందావన్ కాలనీ కల్ట్ క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన సెన్సేషనల్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ సీక్వెల్‌ను కూడా రూపొందిస్తుండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ప్రేమకథకు కొనసాగింపు వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Siri Hanmanth: నాజూకు నడుమందాలతో సిరి హన్మంత్.. గ్లామర్ తో పిచ్చేక్కిస్తోందిగా.. ఫొటోలు

మొదటి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణే ఈ సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తుండగా, అనస్వర రాజన్ కొత్త హీరోయిన్‌గా మెరవనుంది. ఇప్పటికే, అనస్వరకి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అయితే, కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాజెక్టులో భాగం కావడం నిజంగా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తవగా.. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి చాలా కాలం గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ మళ్ళీ ఆ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.