ఆ డైరెక్టర్‌తో కలిసి మందేసి రచ్చ చేశావంటగా.. ఆకతాయి ప్రశ్న.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ..

ఆకతాయి అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన యాంకర్ అనసూయ..

  • Publish Date - April 5, 2020 / 01:04 PM IST

ఆకతాయి అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన యాంకర్ అనసూయ..

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోతోంది. తమ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు సెలబ్స్.

కొన్నిసార్లు నెటిజన్ల నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురవడం కూడా సహజమే. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ అన‌సూయ భ‌రద్వాజ్‌ను ఓ ఆకతాయి షాకింగ్ క్వశ్చన్ అడిగాడు. ‘‘డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో క‌లిసి తాగి రచ్చ చేశార‌ట క‌దా’’ అని అతగాడు ప్రశ్నించాడు.

దీంతో అనసూయ అతగాడిపై కస్సుబుస్సులాడకుండా.. షార్ట్ అండ్ సింపుల్ ఆన్సర్ ఇచ్చింది. ‘‘నువ్వు ఇంకా ప‌రిణితి (మెచ్యూర్) చెందిన‌ట్లు లేవు. ప‌రిణితి చెందితే అస‌లు నిజం తెలుస్తుంది బాబూ..’’ అంటూ ఘాటు రిప్లై ఇవ్వడంతో సదరు నెటిజన్ మిన్నకుండిపోయాడు.

Read Also : బత్తాయికి బలుపు తగ్గలేదు.. దానికి లేని దురద మీకెందుకురా..