Anchor Jhansi : 35 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడంటూ.. యాంకర్ ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా టాలీవుడ్(Tollywood) లో గుండెపోటుతో ఓ మేనేజర్ మరణించాడు. హెయిర్ స్టైలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి యాంకర్ ఝాన్సీకి పర్సనల్ మేనేజర్ గా ఎదిగిన శ్రీను అనే మేనేజర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.

Anchor Jhansi Personal Manager Srinu Passed away with Heart Attack

Anchor Jhansi : ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి పలువురు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో తెలీదు. గత కొన్నాళ్ల నుంచి చిన్న వయసు ఉన్నవాళ్లు కూడా గుండెపోటుతో మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమలో కూడా పలువురు గుండెపోటుతో(Heart Attack) మరణించి విషాదం నింపారు.

తాజాగా టాలీవుడ్(Tollywood) లో గుండెపోటుతో ఓ మేనేజర్ మరణించాడు. హెయిర్ స్టైలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి యాంకర్ ఝాన్సీకి పర్సనల్ మేనేజర్ గా ఎదిగిన శ్రీను అనే మేనేజర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీంతో యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియాలో అతని ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Game of Thrones : వరల్డ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో?

యాంకర్ ఝాన్సీ తన మేనేజర్ శ్రీను ఫోటో షేర్ చేస్తూ..శ్రీను.. శీను బాబు అని నేను ముద్దుగా పిలుస్తాను. అతనే ఇన్నేళ్ళుగా నా సపోర్ట్ సిస్టమ్. హెయిర్ స్టైలిస్ట్ కెరీర్ మొదలుపెట్టి నా పర్సనల్ సెక్రెటరీగా మారాడు. నా పనులన్నీ తనే చూసుకుంటాడు. అతనే నా రిలీఫ్, నా బలం. నన్ను బ్యాలెన్స్ గా ఉంచాడు. ఎంతో మంచివాడు. అతడు నా స్టాఫ్ గా కంటే కూడా నా కుటుంబ సభ్యుడిగా, నా సోదరుడిగా ఉన్నాడు. కానీ 35 ఏళ్లకే ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నాకు మాటలు రావట్లేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.