Pradeep Machiraju : మొత్తానికి బయటకి వచ్చిన ప్రదీప్.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో..

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Anchor Pradeep Second film title Akkada Ammayi Ikkada Abbayi

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సుదీర్ఘ‌కాలం త‌న‌దైన యాంక‌రింగ్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇక వెండితెర‌పై మూవీల్లో చిన్న చిన్న‌పాత్ర‌ల్లోనూ మెరిశాడు. ఇక 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ చిత్రం వ‌చ్చి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. అయిన‌ప్ప‌టికి రెండో సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న రాక‌పోగా.. గ‌త కొన్నాళ్లుగా బుల్లితెర‌పై టీవీ షోల్లోనూ ఆయ‌న క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌దీప్ ఏమైపోయాడు అని అత‌డి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

Iddaru Movie : అర్జున్, JD చక్రవర్తి యాక్షన్ మూవీ ‘ఇద్దరు’.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు త‌న రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి సినిమా టైటిల్ కావ‌డంతో ఈ చిత్రానికి మంచి బ‌జ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో జ‌బ‌ర్థ‌స్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్‌గా న‌టిస్తోంది. నితిన్‌, భరత్‌ల ద్వయం ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

Vishnupriya : అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోయారు.. అమ్మ చనిపోయాక.. బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఎమోషనల్..