Iddaru Movie : అర్జున్, JD చక్రవర్తి యాక్షన్ మూవీ ‘ఇద్దరు’.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Arjun JD Chakravarthy Action Movie Iddaru Releasing Date Announced
Iddaru Movie : యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి మెయిన్ లీడ్స్ లో DS రెడ్డి సమర్పణలో FS ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమ నిర్మాణంలో SS సమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇద్దరు’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇద్దరు సినిమా రేపు అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అని మూవీ టీమ్ తెలిపారు.
Also Read : Vishnupriya : అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోయారు.. అమ్మ చనిపోయాక.. బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఎమోషనల్..
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. జెడి చక్రవర్తి గారు, అర్జున్ గారు ఇద్దరూ టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తులు. డైరెక్టర్ సమీర్ అలాంటి వాళ్లతో మంచి సినిమా తీసాడు అని అన్నారు. నిర్మాత DS రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను తీసాము ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి మంచి హిట్ చేయాలి అని అన్నారు.
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సోని చరిష్ట మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సమీర్ గారికి, సినిమాలో నాకు సపోర్ట్ చేసిన అర్జున్ గారు, చక్రవర్తి గారికి కృతజ్ఞతలు అని తెలిపింది. నిర్మాత, డైరెక్టర్ సమీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి లొకేషన్స్ లో హై క్వాలిటీతో తీసాము. ఇందులో అర్జున్ గారు, చక్రవర్తి గారు పోటీ పడి మరీ నటించారు. హీరోయిన్స్ గా రాధిక కుమారస్వామి, సోనీ చాలా బాగా నటించారు. ఇందులో కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు నటించారు. ఇది ఆయన చివరి సినిమా. అమీర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించారు ఈ నెల 18న థియేటర్స్ లో ఈ సినిమా రానుంది అని తెలిపారు.