టీవీ షోకి, కరోనాకు సంబంధం ఏంటి? నాకు సతీ సావిత్రి క్యారెక్టర్ ఇవ్వు..

తన గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నెటిజన్స్‌‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మి..

  • Publish Date - March 17, 2020 / 02:54 PM IST

తన గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నెటిజన్స్‌‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మి..

రష్మి గౌతమ్.. బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ అండ్ హాట్ యాంకర్‌గా ఆడియన్స్‌ను అలరిస్తోంది. అడపాదడపా హీరోయిన్‌గా సినిమాలు చేసినా.. స్మాల్ స్క్రీన్ ద్వారానే భారీ ఫేమ్, పాపులారిటీ వచ్చాయి. కాస్త ఫేమ్ ఉంటే చాలు కాంట్రవర్సీలు కామనే కాబట్టి రష్మి పేరు మీద కూడా పలుసార్లు పుకార్లు షికార్లు చేశాయి. రీసెంట్‌గా తనను అనవసరంగా టార్గెట్ చేసినందుకుగాను ముగ్గురు నెటిజన్స్‌ను ఓ ఆట ఆడుకుంది.

అసలేం జరిగిందంటే.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ గురించి రష్మి ఓ ట్వీట్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ కరోనా ముఖ్యం కాదన్నట్టు రష్మి హోస్ట్ చేస్తున్న ‘జబర్దస్త్’ షో లో ఆమె డ్రెస్సింగ్, డ్యాన్సింగ్ గురించి కామెంట్ చేశారు. దీనికి రష్మి.. ‘మా షో చూడమని మేమేం బలవంతంగా మీ కాళ్లూ, చేతులూ కట్టేసి టీవీ ముందు కూర్చోబెట్టడం లేదు. మేమేం చేసినా షో డిమాండ్ మేరకే..

Read Also : ప్రభాస్ అండ్ టీమ్ కరోనాను తట్టుకుని మరీ తిరిగొచ్చారు..

నా డ్యాన్స్ నచ్చకపోతే కళ్లు మూసుకోవచ్చు లేదా ఛానెల్ మార్చుకోవచ్చు.. ఈ షో తో ప్రాబ్లమ్ అయితే చూడకుండా ఉండొచ్చు కదా.. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి.. మీరేదైనా సినిమా తీస్తుంటే నాకు సతీ సావిత్రి క్యారెక్టర్ ఇవ్వండి.. నేను చేసే పని గురించి నన్ను క్వశ్చన్ చేయకండి’ అంటూ కాస్త కోపంగా రియాక్ట్ అయింది.

ఓ వ్యక్తి రష్మి ఫోటోలు పోస్ట్ చేస్తూ ‘కామెంట్ చేసే ముందు ఆలోచించండి’ అంటూ కామెంట్ చేయగా.. అతడి ఖాతాలో అసభ్యంగా ఉన్న (ఇలియానా) ఫోటోను చూపిస్తూ.. ‘ఇప్పుడు నీ ఫ్యామిలీ వాల్యూస్ షాపింగ్ వెళ్లాయా.. సొంత గుర్తింపు లేకుండా విదేశీయుడి ఫోటో పెట్టుకుని (అతని ప్రొఫైల్ పిక్‌ని ఉద్దేశిస్తూ) నువ్వు భారతీయ విలువలు, సాంప్రదాయాల గురించి మాట్లాడడమేంటి’ అని అసహనం వ్యక్తం చేసింది. దానికి అతను ‘విదేశీయుడి ఫేస్‌తో నీకు సంబంధం ఏంటి?’ అని అడగ్గా.. ‘మరి టీవీ షోకి, కరోనాకు సంబంధం ఏంటి?’ అంటూ అతగాడు మారు మాట్లాడకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్మి.