Anchor Sowmya
Anchor Sowmya : ఇటీవల ఐపీఎల్ లో ఆర్సీబీ కప్ గెలవడంతో బెంగుళూరులో జరిగిన సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తప్పు పట్టారు.
తాజాగా సీరియల్ నటి, యాంకర్ సౌమ్య ఈ ఘటనపై స్పందించింది. సౌమ్య కూడా కన్నడ నటి. కన్నడతో పాటు తెలుగులో కూడా సీరియల్స్, టీవీ షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యని ఫేవరేట్ క్రికటర్ అని అడిగి బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి ప్రశ్నించారు.
Also Read : Sowmya : ఒక లాయర్ నాతో మిస్ బిహేవ్ చేసాడు.. వాళ్ళ వైఫ్, అమ్మ పక్కకి వెళ్తే చాలు నా మీద చేతులు వేసి..
దీనికి సౌమ్య మాట్లాడుతూ.. నాకు ఫేవరేట్ ఎవరు లేరు. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఇటీవల బెంగుళూరులో తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళు కప్ గెలిచారని అక్కడకి చాలా మంది క్రికెటర్స్ ని చూడటానికి వచ్చారు. అది చాలా రబ్బిష్ ఇన్సిడెంట్. కప్పు రావాలని చాలా ఏళ్లుగా ఎదురుచూసారు, వచ్చింది. అందుకే జనాలు వచ్చారు. వ్యవస్థలు బాగోలేదు. అక్కడ ఏం జరిగిందో కానీ తొక్కిసలాట జరిగి చనిపోయారు చాలా మంది.
క్రికెటర్స్ ని చూడటానికే వచ్చారు. సెలబ్రిటీలు ఎవరైనా వాళ్ళ మీద అభిమానం, రెస్పెక్ట్ ఉండాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ వాళ్ళని లైఫ్ లోకి తీసుకోకూడదు. సెలబ్రిటీలను సెలబ్రిటీలుగానే చూడాలి. వాళ్ళేమీ మన లైఫ్ లోకి వచ్చి అన్నం పెట్టరు, మనకు ఏమన్నా అయితే హాస్పిటల్ బిల్స్ కట్టరు. వాళ్ళు వచ్చి మన కోసం ఏం చేయరు. వాళ్ళ కోసం చనిపోయేదేంటి. వాళ్ళు క్రికెటర్స్ అంతే. దేవుళ్ళు కాదు దేవుళ్ళని ఆరాధించు వాళ్ళని కాదు. అంతమంది వచ్చి తొక్కిసలాట చేయడం ఏంటి? చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ లైఫ్ అంతా బాధపడతారు.
Also Read : Anchor Sowmya : యాక్సిడెంట్ అయినా, రక్తం కారుతున్నా యాంకరింగ్ చేయడానికి వెళ్లిన యాంకర్..
అంతమంది వచ్చి ఇలా జరిగితే కనీసం టీమ్ కండోలిన్స్ కూడా పెట్టలేదు. మన కోసం వచ్చారు పాపం అని చనిపోయిన వాళ్ళింటికి క్రికెటర్స్ ఎవరూ వెళ్ళలేదు. కనీసం వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించలేదు అయ్యో పాపం అనలేదు. ఆర్టిస్ట్, క్రికెటర్ ఎవరైనా లవ్ చేయాలి ఆరాధించకూడదు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టకూడదు. వీళ్ళ ఫేస్ కూడా వాళ్లకు తెలీదు. వాళ్ళు సంపాదించుకుంటారు, ఫారెన్ కి వెళ్తారు, విల్లాలు కొనుక్కుంటారు. వాళ్ళు మన కోసం ఏం చేయరు. వాళ్ళ కోసం అంత ఫూలిష్ గా బతకకూడదు అని అటు ఆర్సీబీ క్రికెటర్స్ పై, ఇటు వాళ్ళను చూడటానికి ఎగబడిన జనాలపై ఫైర్ అయింది.