Akshara Gowda : ఇంటర్వ్యూ మధ్యలో సడెన్‌గా హీరోయిన్‌కి ముద్దు పెట్టిన యాంకర్.. సీరియస్ అయిన హీరో..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ కామరాజు, అక్షర గౌడ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో..

Akshara Gowda : ఇంటర్వ్యూ మధ్యలో సడెన్‌గా హీరోయిన్‌కి ముద్దు పెట్టిన యాంకర్.. సీరియస్ అయిన హీరో..

Anchor Sudden Bold Stunt with Actress Akshara Gowda Video goes Viral

Updated On : March 18, 2024 / 9:51 PM IST

Akshara Gowda : ఇటీవల పలు ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్స్ లో కొంతమంది చేసే పనులు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యాంకర్ ఇంటర్వ్యూ మధ్యలో చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదర్శ్, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మిక్సప్(Mix Up) అనే సినిమా ఆహా(Aha) ఓటీటీలోకి వచ్చింది. లవ్, రొమాన్స్, భార్యాభర్తల మధ్య బంధం.. లాంటి కథాంశంతో బోల్డ్ కంటెంట్ తో మిక్సప్ తెరకెక్కింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ కామరాజు, అక్షర గౌడ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రియదర్శన్ ఇంటర్వ్యూ చేస్తూ మధ్యలో.. ఈ సినిమా బోల్డ్ కాబట్టి నేను కూడా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నాను అని సడెన్ గా హీరోయిన్ చెయ్యి తీసుకొని చేతిపై ముద్దు పెట్టాడు. దీంతో హీరోయిన్ ఆశ్చర్యపోగా హీరో కమల్ కామరాజు సీరియస్ అయ్యాడు.

Also Read : Rajamouli : జపాన్‌లో RRR రీ రిలీజ్.. రాజమౌళికు గ్రాండ్ వెల్కమ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన జక్కన్న..

అసలు అలా ఎలా చేస్తావు, సినిమా బోల్డ్ అయితే మాత్రం ఇంటర్వ్యూలో ఇలా ఎవరైనా చేస్తారా, కనీసం పర్మిషన్ కూడా అడగవా అంటూ హీరో సీరియస్ అయ్యాడు. దీంతో యాంకర్.. హీరోయిన్ కి ఏం ప్రాబ్లమ్ లేదు మీకెందుకు అన్నాడు. ఇలా యిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరగగా దాన్ని ప్రోమో రూపంలో కట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. అయితే ఇది హీరోయిన్, యాంకర్ కలిసి ముందే అనుకోని హీరో మీద ప్రాంక్ చేసినట్లు తర్వాత వీడియోలో తెలిపారు. అయితే యాంకర్ హీరోయిన్ చెయ్యి పట్టుకొని హీరోయిన్ కి కాకుండా తన చేతికే ముద్దు పెట్టుకున్నాడని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి స్టంట్స్ ప్రమోషన్స్ కోసం అని విమర్శిస్తూ కొంతమంది కామెంట్స్ చేస్తే, కొంతమంది ప్రాంక్ బాగా వర్కౌట్ అయింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్ కి యాంకర్ చేతి మీద కిస్ పెట్టిన వీడియో వైరల్ గా మారింది.