Anchor Vishnupriyaa Bhimeneni Reacts on Betting Apps and Betting Apps Promotion Case
Vishnupriya : ఇటీవల యాంకర్ విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు ఆమెపై కేసు ఫైల్ చేసారు. ఆ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి వచ్చింది. అప్పట్నుంచి విష్ణు ప్రియ దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి, ఆ కేసు గురించి మాట్లాడింది.
విష్ణు ప్రియ మాట్లాడుతూ.. వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమన్నప్పుడే నేను ఆల్రెడీ ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసిందేనా అని అడిగాను. వాళ్ళు అవును అన్నారు. నేను నమ్మేసాను. కొన్ని రాష్ట్రాల్లో ఇవి చట్ట విరుద్ధం కాదు అందుకే నేను కూడా చేశాను. అవి ప్రమోట్ చేసి నేను తప్పు చేశాను. కానీ అది నాకు తెలియక చేశాను. నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. ఆ కేసులు, సెక్షన్స్ నాకు తెలీదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు చాలా సేపు కూర్చోపెట్టారు. రిమాండ్ లో పెడతామన్నారు. కానీ లాయర్లు అంతా కేర్ తీసుకొని బయటకు తీసుకొచ్చారు.
Also Read : Balagam Actor : సినీ పరిశ్రమలో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత..
అప్పుడు బెట్టింగ్ యాప్స్ చట్ట విరుద్ధం అని నాకు తెలియదు. అందుకే చేశాను. ఒకవేళ అవి తప్పైతే గవర్నమెంట్ ఆపాలి. మా దాకా రాకుండా ప్రభుత్వం చూసుకోవాలి. అయినా అందులో మాకు ప్రమోట్ చేసినందుకు కూడా డబ్బులు చాలా తక్కువే ఇచ్చేది. ఆ బెట్టింగ్ యాప్స్ నడిపేవాళ్లు మాత్రం కోట్లు కూడబెట్టుకుంటారు. మమ్మల్ని టార్గెట్ చేయొద్దు. ఆ బెట్టింగ్ యాప్స్ మొదలుపెట్టి నడిపిన వాళ్ళని కదా పట్టుకోవాలి. ప్రమోట్ చేసే వాళ్ళని కాదు, అవి ఆడించేవాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే బెట్టింగ్ ఆడటం వల్ల కష్టాలు అని జనాలకు కూడా అవగాహన ఉండాలి. నేను అంతకుముందు చాలా మంచి ప్రమోషన్స్ చేశాను. అవేమి చూడలేదు. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాను అని బాగా ట్రోల్ కూడా చేశారు అని తెలిపింది.
Also Read : Bunny Vas : మన యూనిటీ ఎలా ఉంది..? పవన్ కళ్యాణ్ లేఖపై స్పందించిన గీత ఆర్ట్స్ నిర్మాత.. ట్వీట్ వైరల్..