Balagam Actor : సినీ పరిశ్రమలో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత..
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

Balagam Actor GV Babu Passed Away
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బలగం నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని బలగం మూవీ దర్శకుడు వేణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘జీవి బాబు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.
జి వి బాబు గారు ఇకలేరు🙏
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏#balagam #artist #stage #plays #natakam pic.twitter.com/fzDHReHt8g— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 25, 2025
జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.