Cinematography Minister : జనసేనకే సినిమా శాఖ.. ఏపీ కొత్త సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరంటే..?

సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరికీ ఇస్తారు అని ఆలోచించగా జనసేనకే కేటాయించడం గమనార్హం.

Cinematography Minister : ఇటీవల ఏపీలో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు.

ఏపీలో కూటమి ఏర్పడటంతో సినీ పరిశ్రమలో అందరూ ఆనందం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో సినీ పరిశ్రమ ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు దక్కుతాయని భావిస్తుంది. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరికీ ఇస్తారు అని ఆలోచించగా జనసేనకే కేటాయించడం గమనార్హం.

Also Read : ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు ఏ శాఖ కేటాయించారంటే..?

పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖలు కేటాయించగా జనసేన తరపున నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. నిడదవోలు ఎమ్మెల్యే, జనసేన నేత కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు టూరిజం & కల్చర్ శాఖలు కూడా కేటాయించారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపున MLC గా ఉన్న కందుల దుర్గేష్ ఆ తర్వాత జనసేనలో చేరి పార్టీ కోసం మొదట్నుంచి పని చేసారు. గత ఎన్నికల్లో ఓడిపోగా ఈ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిష్టర్ గా సినిమా వాళ్లకు ఎంత సపోర్ట్ గా ఉంటాడో, సినిమా వారితో ఎలాంటి సత్సంబంధాలు ఏర్పరుచుకుంటాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు