Guppedantha Manasu : రిషి చెప్పిన నిజాలు విని షాకైన విశ్వనాథం, ఏంజెల్.. కట్టుకథ అంటూ గేలి చేసిన ఏంజెల్
రిషి, వసుధరలు విశ్వనాథం ఇంటికి వెళ్తారు. రిషి చెప్పిన నిజాలు విని విశ్వనాథం, ఏంజెల్ షాకవుతారు. ఏంజెల్ రిషి చెప్పింది నమ్ముతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu
Guppedantha Manasu : మహేంద్ర ఇంటికి ఫణీంద్ర కుటుంబం వెళ్తారు. అక్కడ దేవయానికి అవమానం జరుగుతుంది. విశ్వనాథం ఇంటికి వెళ్లిన రిషి.. వసుధరతో తన పెళ్లి ఎలా జరిగిందో ఏంజెల్‌కి నిజాలు చెప్తాడు. ఆ తర్వాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది.
Sravanthi Ravi Kishore : త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
ఫణీంద్ర కుటుంబం మహేంద్ర ఇంటికి వస్తుంది. రిషి, వసుధర ఎక్కడికి వెళ్లారని మహేంద్రని ఆత్రంగా అడుగుతాడు శైలేంద్ర. పని మీద బయటకు వెళ్లారని చెబుతాడు మహేంద్ర. ఇంట్లో ఒక్కడివే ఎందుకు మనింటికి భోజనానికి రా అంటూ మహేంద్రని పిలుస్తాడు ఫణీంద్ర. జగతి లేని ఇంటికి తాను రాలేనని క్షమించమని ఫణీంద్రని అడుగుతాడు మహేంద్ర. తాను కోపంలో అన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకోవద్దని మహేంద్రని రమ్మని అడుగుతుంది దేవయాని. ‘మీరు అన్న మాటలు నా మనసుని కలిచి వేసాయి నేను రాలేను నన్ను బలవంత పెట్టొద్దు’ అని దేవయానితో అంటాడు మహేంద్ర. తమ ఇంట్లోనే అందరం కలిసి భోజనం చేద్దామని అంటాడు.
రిషి, వసుధరలు విశ్వనాథం ఇంటికి వెళ్తారు. విశ్వనాథం, ఏంజెల్ తన కష్టకాలంలో ఆదుకున్నారని తనకు పెళ్లైందన్న విషయం చెప్పనందుకు ఏంజెల్ చాలా బాధపడి ఉంటుందని వసుధరతో అంటాడు రిషి. తాను ఉన్న పరిస్థితుల్లో చెప్పలేకపోయానని కనీసం నువ్వైనా మన ఇద్దరి విషయం ఏంజెల్‌తో చెప్పాల్సింది అంటాడు వసుధరతో. అప్పడు మన మధ్య ఉన్న పరిస్థితుల కారణంగా తను ఏంజెల్‌కి నిజం చెప్పలేకపోయానని అంటుంది వసుధర. ఏది ఏమైనా ఏంజెల్‌కి నిజం చెప్పాలంటాడు రిషి. ఇద్దరు విశ్వనాథం ఇంట్లోకి వెళ్తారు.
Anchor Jhansi : 35 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడంటూ.. యాంకర్ ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్..
విశ్వనాథం, ఏంజెల్ రిషి, వసుధరలను చూసి షాకవుతారు. వసుధరతో పెళ్లి అవుతున్నప్పుడైనా చెబితే తాము సంతోషంగా వచ్చేవాళ్లం కదా అంటాడు విశ్వనాథం. ఒకప్పుడు మహేంద్ర, జగతిలు తనకు ఆత్మీయులు అని చెప్పానని కానీ వాళ్లు తన తల్లిదండ్రులు అనే నిజాన్ని వాళ్లకు చెబుతాడు రిషి. ఇద్దరు ఆశ్చర్యపోతారు. వసుధరకి, తనకి నిశ్చితార్ధం అయ్యాక కొన్ని కారణాల వల్ల దూరమయ్యామని చెప్తాడు. ఇద్దరి మధ్యా ప్రేమ ఉన్నా దూరం పెరిగి ప్రేమను బయటకు చెప్పుకోలేక మనోవేదన అనుభవించామని చెప్తాడు. తన తల్లి జగతి కోరిక మేరకు ఇద్దరూ ఒకటయ్యామని అంటాడు. అంతా విన్న ఏంజెల్ కట్టుకథ చెబుతున్నావని క్లాప్స్ కొడుతూ రిషిని ఎద్దేవా చేస్తుంది. ఆ తర్వాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.