Site icon 10TV Telugu

Anil Ravipudi-Chiranjeevi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో విలన్ అత‌డేనా!

Anil and Chiranjeevi Movie Villaian

Anil and Chiranjeevi Movie Villaian

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో చిరు అలరించబోతున్నాడంట. అయితే చిరుకు విలన్ గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు విలన్ గా సత్యదేవ్ నటించాడు.

అయితే చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఈసారి కార్తీకేయ విలన్ గా చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆర్ఎక్స్-100తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ.. విలన్ గా కూడా చేస్తూ అందరిని అలరిస్తున్నాడు.

https://youtu.be/T58Orr3-NuI?si=3qhVgr7ovWYxNlYY

నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీమ్ లో కూడా విలన్ గా చేశాడు. దీంతో మరోసారి కార్తీకేయ మెగాస్టార్ చిరుకు విలన్ గా చేయబోతున్నాడని టాక్. మరి ఇది నిజమా కాదా అనేది అనిల్ అండ్ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Rithu Chowdary : నేను టెన్త్ లో ఉన్నప్పుడే క్యాస్టింగ్ కౌచ్.. ఫేమస్ సీరియల్ యాక్టర్ కోసం వాళ్ళ మేనేజర్ అలా అడిగాడు..

ఎప్పుడూ సీరియస్ యాక్షన్ రోల్ లో చిరును చూసే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కామెడీ రోల్ లో చిరును ఎలా చూస్తారనేది ఇప్పుడు మెగా సస్పెన్స్. విక్టరీ వెంకటేశ్ తో ఎఫ్-2, ఎఫ్-3 తో నవ్వుల పండగను పూయించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరుతో ఎలాంటి కామెడీని పండిస్తారనేది సినిమా విడుదలైన తర్వాత చూడాల్సిందే.

Exit mobile version