Rithu Chowdary : నేను టెన్త్ లో ఉన్నప్పుడే క్యాస్టింగ్ కౌచ్.. ఫేమస్ సీరియల్ యాక్టర్ కోసం వాళ్ళ మేనేజర్ అలా అడిగాడు..

తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

Rithu Chowdary : నేను టెన్త్ లో ఉన్నప్పుడే క్యాస్టింగ్ కౌచ్.. ఫేమస్ సీరియల్ యాక్టర్ కోసం వాళ్ళ మేనేజర్ అలా అడిగాడు..

Rithu Chowdary Shares her Casting Couch Experience in TV Industry

Updated On : April 28, 2025 / 10:10 PM IST

Rithu Chowdary : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

రీతూ చౌదరి మాట్లాడుతూ.. నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే అవకాశాల కోసం ట్రై చేశాను. అప్పట్లో ఖమ్మంలో ఉండేదాన్ని. ఓ సీరియల్ ఆడిషన్ అని ఖమ్మం నుంచి మా నాన్నతో కలిసి వచ్చాను. వాళ్ళు మా నాన్నతో వస్తానని ఊహించలేదు. ఆడిషన్ అయ్యాక ఒక మేనేజర్ వచ్చి ఒక ఫేమస్ సీరియల్ యాక్టర్ పేరు చెప్పి అతనితో అలా ఉండాలి, ఉంటేనే ఛాన్స్ వస్తుంది, నువ్వొక్కదానివే రావాలి అని చెప్పారు. దాంతో అప్పుడు నాకు వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోయాను. అప్పుడు చిన్న పిల్లని, అప్పుడే అలా అడిగారు. ఆ సీరియల్ యాక్టర్ అలాంటి వాడా అని షాక్ అయ్యాను.

Also Read : Rithu Chowdary : మా నాన్న చనిపోయినప్పుడు మేము ఏడుస్తుంటే డబ్బులు ఇవ్వాలి అని.. SRH నితీష్ రెడ్డి ఇంటర్వ్యూ చూసి..

మళ్ళీ నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ తోనే ఓ సీరియల్ లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్ ని.. ఆ సంఘటన గురించి అడగాలి అనుకున్నాను కానీ అడగలేదు. ఆ తర్వాత ఎప్పుడూ అలాంటిది ఫేస్ చేయలేదు అని తెలిపింది. మరి ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు.